
రెబెల్ స్టార్ ప్రభాస్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్ సినిమా షూటింగ్ గత మూడేళ్ళుగా సాగుతూనే ఉంది. రాధే శ్యామ్ టీమ్ కు పలు కారణాల వల్ల షూటింగ్ జాప్యమవుతూ వచ్చింది. ఈ మధ్య షూటింగ్ పూర్తయింది అనుకున్నా మళ్ళీ కొన్ని సీన్స్ ను రీషూట్ చేస్తున్నట్లు తెల్సింది.
ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ గండిపేట కోట, కడప జిల్లాలో సాగుతోంది. సత్యరాజ్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. లేటెస్ట్ గా సత్యరాజ్ లుక్ లీక్ అయింది. పూర్తిగా డివోషనల్ లుక్ లో సత్యరాజ్ ఉన్నాడు. గతంలో మిర్చి, బాహుబలి సినిమాల్లో సత్యరాజ్, ప్రభాస్ తో కలిసి నటించాడు. మరి ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషిస్తున్నాడో చూడాలి.
రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తాడు. డస్కీ బ్యూటీ పూజ హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీత దర్శకుడు కాగా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
Actor #SathyaRaju & Director @director_radhaa
From The Sets Of #RadheShyam At Gandikota.#Prabhas pic.twitter.com/g0NehVdOSe— MANA PRABHAS ᵀᴹ (@ManaPrabhasOffl) August 23, 2021
Satya Raj Garu From The Sets Of #RadheShyam ????????#Prabhas pic.twitter.com/JytrSPSjpU
— Konaseema Rebels 2.O (@RebelsKonaseema) August 21, 2021