
హీరో నుండి క్యారెక్టర్ పాత్రలకు షిఫ్ట్ అయ్యాక జగపతి బాబు కెరీర్ ఓ రేంజ్ లో మారింది. విలన్ పాత్రలకు క్యారెక్టర్ రోల్స్ తో జగపతి బాబు ఫుల్ బిజీ అయ్యాడు. ఈ మధ్య కొంచెం అవకాశాలు తగ్గినట్లు అనిపించాయి కానీ జగపతి బాబు మళ్ళీ బిజీ అయ్యాడు. నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రంలో కీలక పాత్ర చేస్తోన్న జగ్గు భాయ్, సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ఆన్నాత్తేలో కీ రోల్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ స్టార్ నటుడు జగపతి బాబు మరో భారీ ప్రాజెక్ట్ ను పట్టాడు. రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం సలార్. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సాగుతోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రంలో జగపతి బాబు కూడా కీ రోల్ చేస్తున్నాడు. ఈ విషయం రీసెంట్ గా రివీల్ అయింది. హోంబేలె ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏప్రిల్ 14, 2022న ఈ సినిమా విడుదల కానుంది.