
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న సర్కారు వారి పాట షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. రీసెంట్ గా మహేష్ బాబు, కీర్తి సురేష్, ఇంకా కీలకమైన కాస్ట్ అండ్ క్రూ మొత్తం స్పెయిన్ కు చెక్కేశారు. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం బార్సెలోనాలో సర్కారు వారి పాటకు సంబంధించిన ఒక సాంగ్ ను మహేష్, కీర్తిలపై చిత్రీకరించనున్నారు. ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ కూడా స్పెయిన్ వెళ్లి టీమ్ ను కలిసాడు.
ఈ సాంగ్ తర్వాత మెజారిటీ పోర్షన్స్ ను చిత్రీకరించి హైదరాబాద్ తిరిగి రానుంది టీమ్. హైదరాబాద్ వచ్చాక మరో రెండు సాంగ్స్ ను పూర్తి చేసి మిగిలిన ప్యాచ్ వర్క్ సీన్స్ ను షూట్ చేస్తే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. నవంబర్ చివరికల్లా ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నాడు మహేష్. డిసెంబర్ నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాన్ని షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న సర్కారు వారి పాటను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతికి సర్కారు వారి పాటను విడుదల చేయాలని నిర్ణయించారు.