Homeన్యూస్స్పెయిన్ కు వెళ్లనున్న సర్కారు వారి పాట

స్పెయిన్ కు వెళ్లనున్న సర్కారు వారి పాట

స్పెయిన్ కు వెళ్లనున్న సర్కారు వారి పాట
స్పెయిన్ కు వెళ్లనున్న సర్కారు వారి పాట

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సర్కారు వారి పాట చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దుబాయ్ లో నెల రోజుల షూటింగ్ తర్వాత మెజారిటీ షూటింగ్ అంతా ఇండియాలోనే సాగింది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసినట్లు మహేష్ ఇటీవలే రివీల్ చేసారు.

ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్ నిజానికి యూఎస్ లో చేద్దామని అనుకున్నారు కానీ వీసా సమస్యల కారణంగా దుబాయ్ ఇంకా స్పెయిన్ కు మార్చారు. దుబాయ్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. ఇక స్పెయిన్ షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది. దీంతో చిత్రం దాదాపుగా పూర్తయినట్లే.

- Advertisement -

పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. సర్కారు వారి పాట టీజర్ కు రెస్పాన్స్ ఓ రేంజ్ లో వచ్చిన విషయం తెల్సిందే. త్వరలోనే చిత్ర ప్రమోషన్స్ కూడా మొదలవుతాయి. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All