Homeటాప్ స్టోరీస్శ్రీదేవి సోడా సెంటర్ కు రివ్యూ ఇచ్చిన మహేష్ బాబు

శ్రీదేవి సోడా సెంటర్ కు రివ్యూ ఇచ్చిన మహేష్ బాబు

mahesh babu reviews sridevi soda center
mahesh babu reviews sridevi soda center

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినిమాలు చూడటం ప్రధాన హాబీ. రీసెంట్ గా విడుదలైన సినిమాలను తన ప్రివ్యూ థియేటర్ లో చూస్తుంటాడు మహేష్ బాబు. ఆ తర్వాత తనకు నచ్చిన సినిమాల గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా నిన్న విడుదలైన శ్రీదేవి సోడా సెంటర్ గురించి స్పందించాడు మహేష్ బాబు. ముందుగా సుధీర్ బాబు మహేష్ సినిమాను చూస్తున్నాడని, ప్రివ్యూ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు.

తర్వాత కొద్దిసేపటికే మహేష్ బాబు ట్విట్టర్ లో సినిమాను పొగుడుతూ ట్వీట్ చేసాడు. “శ్రీదేవి సోడా సెంటర్…హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ తో రూపొందిన ఒక రా, ఇంటెన్స్ చిత్రం. పలాస 1978 తర్వాత దర్శకుడు కరుణ కుమార్ నుండి వచ్చిన మరో బోల్డ్ అటెంప్ట్. సుధీర్ బాబు సూపర్బ్. తన బెస్ట్ పెర్ఫార్మన్స్. నరేష్ నుండి వచ్చిన మరో అద్భుతమైన పెర్ఫార్మన్స్. ఆనంది శ్రీదేవి క్యారెక్టర్ లో సరిగ్గా సరిపోయింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చక్కగా కుదిరాయి. టీమ్ అంతటికీ కంగ్రాట్స్” అని ట్వీట్ చేసాడు మహేష్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All