Homeన్యూస్సర్కార్ వారి నుండి మాస్ బిట్ రాబోతుంది..

సర్కార్ వారి నుండి మాస్ బిట్ రాబోతుంది..

సర్కార్ వారి నుండి మాస్ బిట్ రాబోతుంది..
సర్కార్ వారి నుండి మాస్ బిట్ రాబోతుంది..

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలు మొదలుపెట్టి సినిమా ఫై అంచనాలు పెంచుతున్నారు. రీసెంట్ గా విడుదలైన కళావతి సాంగ్ యూట్యూబ్ లో అనేక రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.

కళావతి పాటను క్రేజీ సింగర్ సిద్ శ్రీరామ్ పాడగా, ప్రముఖ సాహిత్య రచయిత అనంత శ్రీరామ్ లిరిక్స్ అందిచారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తుండడం మేకర్స్ , అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోసారి థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని ఫిక్స్ అయ్యారు.

- Advertisement -

ఇదిలా ఉంటె త్వరలోనే ఒక మాస్ బిట్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారట. టైటిల్ సాంగ్ ను మహేష్ బాబు అభిమానుల కోసం ఫుల్ మాస్ గా ట్యూన్ చేశాడట థమన్.  ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మార్చి 18వ తారీకున పాట వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాస్త అటు ఇటుగా అయినా పాట మార్చి రెండవ లేదా మూడవ వారంలో రావడం పక్కా అని అభిమానులకు యూనిట్ సభ్యులు హింట్ ఇస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో  ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All