Homeటాప్ స్టోరీస్సరిలేరు నీకెవ్వరు అక్కడ కూడా తగ్గట్లేదు

సరిలేరు నీకెవ్వరు అక్కడ కూడా తగ్గట్లేదు

సరిలేరు నీకెవ్వరు అక్కడ కూడా తగ్గట్లేదు
సరిలేరు నీకెవ్వరు అక్కడ కూడా తగ్గట్లేదు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మాస్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ఎబోవ్ యావరేజ్ రేటింగులే వచ్చాయి. దీంతో పోలిస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రానికి బెటర్ టాక్ వచ్చింది. అయినా కానీ సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ పరంగా ఎక్కడా తగ్గట్లేదు. ఇటు డొమెస్టిక్ మార్కెట్ లో సరిలేరుకి తిరుగులేకుండా ఉంది. అయితే సాధారణంగా మాస్ ఎంటెర్టైనెర్స్ కు ఓవర్సీస్ లో పెద్దగా మార్కెట్ ఉండదు. కానీ సరిలేరు నీకెవ్వరు ఇక్కడ కూడా దూసుకుపోతోంది. ముఖ్యంగా మహేష్ బాబు స్టామినా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తోంది. మహేష్ సినిమాలు సాధారణంగా యూఎస్ లో బాగా ఆడతాయి. వరసగా 8 సినిమాలు 1 మిలియన్ దాటిన రికార్డ్ మహేష్ సొంతం. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ఆ సంఖ్య 9కి చేరింది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఇలా వరసగా 9 సినిమాలు యూఎస్ లో 1 మిలియన్ మార్క్ చేరుకోవడం అనేది టాలీవుడ్ లో ఒక్క మహేష్ కే సాధ్యపడింది.

ఇక నిన్నటితో సరిలేరు నీకెవ్వరు యూఎస్ లో 1.5 మిలియన్ మార్క్ ను కూడా చేరుకోవడం విశేషం. దీంతో ఈ మార్క్ దాటిన మహేష్ సినిమాల సంఖ్య 7కు చేరుకుంది. రీసెంట్ గా అయితే ఒక్క మహర్షి తప్పితే మిగిలిన సినిమాలు అన్నీ 1.5 మిలియన్ మార్క్ ను చేరుకున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే ఈరోజు, రేపట్లో 2 మిలియన్ మార్క్ ను కూడా చేరుకోవడం ఖాయం. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి యూఎస్ లో అల వైకుంఠపురములో నుండి టఫ్ కాంపిటీషన్ ఉంది. అక్కడ బన్నీకి తోడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్రాండ్ ఇమేజ్ కూడా కలిసొస్తోంది కాబట్టి వసూళ్లు ఓ రేంజ్ లో ఉన్నాయి.

- Advertisement -

ఏదేమైనా సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా మహేష్ మరోసారి తన స్టామినాను నిరూపించాడు. ఇటు డొమెస్టిక్ మార్కెట్ లో కూడా సరిలేరు బాగా ఆడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 40 కోట్ల మార్క్ ను దాటి దూసుకుపోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All