Homeటాప్ స్టోరీస్సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ

సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ

Sarileru Neekevvaru Movie Review in Telugu
Sarileru Neekevvaru Movie Review in Telugu

సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ:
నటీనటులు:  మహేష్ బాబు, రష్మిక, విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత తదితరులు
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: అనిల్ సుంకర, మహేష్ బాబు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
విడుదల తేది: 11-01-2020
రేటింగ్: 3.5/5

సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ సినిమా చేసి చాలా రోజులైంది. గత కొన్ని చిత్రాలుగా ప్యాసివ్ రోల్స్ లోనే కనిపిస్తూ వచ్చిన మహేష్ బాబు పూర్తిగా యాక్టివ్ రోల్ చేసిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఆర్మీ మేజర్ గా మహేష్ నటించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:
అజయ్ కృష్ణ (మహేష్ బాబు) సైన్యంలో మేజర్ గా పనిచేస్తుంటాడు. దేశం ముందు వేరేవి ఏవీ ముఖ్యంగా కాని తనకు అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ కు వెళ్లాల్సి వస్తుంది. అసలు అజయ్ కర్నూల్ ఎందుకు వెళ్ళాలి? అక్కడ తనకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అక్కడ కొన్ని సమస్యల్లో ఇరుక్కున్న భారతి (విజయశాంతి)కి అజయ్ అండగా ఎలా నిలిచాడు అన్నది చిత్ర కథాంశం.

- Advertisement -

నటీనటులు:
తన కెరీర్ లో చాలా తక్కువ సార్లు మాస్ రోల్ లో కనిపించాడు మహేష్. అయితే మాస్ సినిమా చేసిన సినిమాల్లో అత్యధిక శాతం హిట్లు కొట్టాడు. అయితే హీరోగా మాత్రం మహేష్ నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసాడు. డ్యాన్స్ లు కానీ, ఫైట్లు కానీ కామెడీ కానీ మహేష్ చాలా ఉత్సాహంగా కనిపించాడు. మహేష్ ను ఇలా చూసి చాలా కాలం కావడంతో అభిమానులకు పండగే.

విజయశాంతి పాత్ర చాలా హుందాగా ఉంది. ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించింది. కంబ్యాక్ కు సరైన సినిమా. ప్రకాష్ రాజ్ అవ్వడానికి ఇందులో విలన్ అయినా చాలా షేడ్స్ ఉన్నాయి. తన పాత్రను తీర్చిదిద్దిన విధానమే సరికొత్తగా ఉండడంతో ప్రకాష్ రాజ్ కూడా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రాజేంద్ర ప్రసాద్ సినిమా అంతటా మహేష్ తోనే కనిపిస్తాడు.

సాంకేతిక నిపుణులు:
దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీసాడు. మహేష్ ఇంట్రడక్షన్ సీన్, ప్రకాష్ రాజ్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్లాక్, ఫారెస్ట్ ఫైట్.. ఇలా చాలా సన్నివేశాల్లో దేవి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. పాటల పరంగానూ దేవి మెప్పిస్తాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ చిత్రానికి మెయిన్ ప్లస్. విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ మరికాస్త పదునుగా ఉంటే బాగుండేది. సినిమా లెంగ్త్ ఎక్కువైన భావన కలుగుతుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. డైలాగులు చాలా బాగున్నాయి. అనిల్ రావిపూడి సాధారణంగా పెట్టే మ్యానరిజమ్స్ దగ్గరనుండి, రాజకీయ నాయకులకు కరప్షన్ మీద క్లాస్ తీసుకునే సీన్ వరకూ చాలా చోట్ల డైలాగులు పేలాయి. కథ పాతదే అయినా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని మహేష్ అభిమానులను దృష్టిలో ఉంచుకునే తీసాడు. ఫ్యాన్స్ స్టఫ్ కోసం చాలానే సీన్లు ఉన్నాయీ సినిమాలో. దర్శకుడిగా అనిల్ రావిపూడి సంతృప్తిపరుస్తాడు. ఇంకా బాగా తీయొచ్చు అనే ఫీలింగ్ కలిగించినా మొత్తంగా చూసుకుంటే మెప్పిస్తాడు.

విశ్లేషణ:
మిలిటరీ ఎపిసోడ్ దగ్గరనుండి ట్రైన్ ఎపిసోడ్, ఇంటర్వల్ బ్లాక్ లతో ఫస్ట్ హాఫ్ చాలా హాయిగా గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ ఆరంభం కూడా చాలా బాగుంది. ఈ పార్ట్ మిస్ అవ్వకూడదు. ఇక మొదటి 20 నిమిషాల తర్వాత కొంత బోర్ కొట్టించిన ఫీలింగ్ కలుగుతుంది. మళ్ళీ మైండ్ బ్లాక్ సాంగ్, విజయశాంతితో ఎమోషనల్ సీన్, సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ తో సినిమాలో ఊపు వస్తుంది. అయితే క్లైమాక్స్ ను ముగించిన తీరు మాత్రం ప్రేక్షకుల పెదవి విరుపుకు కారణమవుతుంది. మొత్తానికి సంక్రాంతి సీజన్ కు సరైన మాస్ ఎంటర్టైనర్ గా సరిలేరు నీకెవ్వరు గురించి చెప్పుకోవచ్చు.

Sarileru Neekevvaru Movie Review in English

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All