Homeటాప్ స్టోరీస్తమిళంలో రెడీ అవుతున్న ఫ్యామిలీ ప్యాకేజ్

తమిళంలో రెడీ అవుతున్న ఫ్యామిలీ ప్యాకేజ్

Sarath Kumar Radhika and Varalakshmi joined multi starrer
Sarath Kumar Radhika and Varalakshmi joined multi starrer

అందుకే బాగా ఫేమస్ అవ్వకూడదు అంటారు, ఎందుకంటే బాగా ఫేమస్ అయితే ఎవ్వరినీ నమ్మలేని పరిస్థితి వస్తుంది, అప్పుడు మనమే ఒక కాంపౌండ్ పెట్టుకుని పని చేసుకోవాలి. లోకులు పలు కాకులు,… వాళ్ళేమో ఎవడి బాధ ఆడిది అనుకోరు కదా.! అయినా ఏం చేస్తాం.. ఇలాంటి బాధలు సినిమా ఫీల్డ్ లో, రాజకీయంలో బాగా ఎక్కువగా ఉంటాయి. రాజకీయాలు ఇప్పుడు కాసేపు పక్కన పెడితే,

తమిళ చిత్రసీమలో ప్రస్తుతం ఫ్యామిలీ కాంపౌండ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు ఆ క్లబ్ లో శరత్ కుమార్ కూడా చేరిపోయారు. ఆయన గొప్ప నటుడు. లారెన్స్ తో నటించిన “కాంచన” సినిమాలో హిజ్రా గా ఆయన నటన ఎవరూ మర్చిపోలేరు. విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ గా నిలిచారు శరత్ కుమార్. ఆయన భార్య రాధిక గారు హీరోయిన్ గా హిట్ అయ్యారు. తదుపరి బుల్లితెర మీద సీరియల్స్ రంగం లో ప్రవేశించి, సొంతంగా ఎన్నో హిట్ సీరియల్స్ రూపొందించారు.  వారి అమ్మాయి వరలక్ష్మి కూడా మొదట హీరోయిన్ గా తెరంగేట్రం చేసి ఇప్పుడు లేడీ విలన్ గా సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఒక సినిమా చేస్తున్నారని, అది కూడా మలయాళం లో హిట్ అయిన దృశ్యం లాంటి సబ్జెక్ట్ అని తెలుస్తోంది.

- Advertisement -

ఇక ఇండస్ట్రీ లో హిట్ అయిన ఈ ముగ్గురూ కలిసి చేస్తున్న ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్రాజెక్ట్ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All