Homeటాప్ స్టోరీస్బాలయ్య కోసం మొత్తం అన్నీ స్పెషల్ గా సిద్ధం చేస్తోన్న బోయపాటి

బాలయ్య కోసం మొత్తం అన్నీ స్పెషల్ గా సిద్ధం చేస్తోన్న బోయపాటి

బాలయ్య కోసం మొత్తం అన్నీ స్పెషల్ గా సిద్ధం చేస్తోన్న బోయపాటి
బాలయ్య కోసం మొత్తం అన్నీ స్పెషల్ గా సిద్ధం చేస్తోన్న బోయపాటి

నందమూరి బాలకృష్ణ టైమ్ ఇప్పుడసలే మాత్రం బాలేదు. ఈ ఏడాది రెండు భారీ ప్లాపులు చవిచూశాడు. ప్లాపులు బాలయ్యకు కొత్త కాదు కానీ తన తండ్రి బయోపిక్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తే అది కాస్తా ప్లాప్ అవ్వడమే కాకుండా నెగటివ్ ప్రచారానికి కారణమైంది. టిడిపికి రాజకీయాల టైమ్ లో ఈ సినిమా హెల్ప్ కాకపోగా నెగటివ్ గా పనిచేసింది. దాంతో బాలయ్య బాగా కృంగిపోయాడు. సినిమా విడుదలవకుండానే మరో సినిమాను ప్రకటించే బాలకృష్ణ ఈసారి మాత్రం కొంచెం టైమ్ తీసుకుని సినిమా మొదలుపెట్టాడు. అందరూ అనుకున్నట్లు బోయపాటి శ్రీనుతో సినిమా కాకుండా ముందుగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమా కోసం ఎంతలా ప్రయత్నిస్తున్నా కానీ ఎందుకనో రావాల్సిన రేంజ్ లో హైప్ రావట్లేదు. పైగా బాలకృష్ణపై ఎప్పుడూ లేనన్ని ట్రోల్స్ ఈ సినిమాకు పడుతున్నాయి. టీజర్ విడుదల చేసారు కానీ అది రొటీన్ అన్న విషయం తేలిపోయింది. బాలకృష్ణ సినిమాల్లో సాధారణంగా కనిపించే టెంప్లేట్ ఈ సినిమాలో కూడా ఉంది. మరి రెగ్యులర్ సినిమాలను అంతలా ఆదరించని ఈ తరం జనం, రూలర్ ను ఏ మేరకు ఆదరిస్తారన్నది కీలకంగా మారింది.

డిసెంబర్ 20న రూలర్ విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ అన్నిటికీ రంగం సిద్ధమైంది. ఇప్పటివరకైతే ఈ చిత్రంమీద పాజిటివ్ హైప్ ఏం రాలేదు. మరి ట్రైలర్, సాంగ్స్ విడుదలయ్యాక, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగాక ఏమైనా అవుతుందేమో చూడాలి. అయితే ఈ సినిమా విడుదల కాకుండానే ఎప్పటినుండో పెండింగ్ లో పెట్టిన బోయపాటి శ్రీనుతో తన సినిమాను మొదలుపెట్టాడు బాలకృష్ణ. తన 106వ చిత్రానికి సంబంధించిన ముహూర్తం నిన్ననే జరిగిన విషయం తెల్సిందే. అటు బాలకృష్ణ, ఇటు బోయపాటి ఫామ్ ప్రస్తుతం అంత ఆశాజనకంగా లేకపోయినా ఈ సినిమాకు బడ్జెట్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఏకంగా 40 నుండి 50 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.

- Advertisement -

బోయపాటి సినిమా అంటే ఉండే హంగామానే వేరు. తెర నిండా పేరున్న నటీనటులను పెట్టడంలో బోయపాటి సిద్ధహస్తుడు. అలాగే తన సినిమాల్లో విలన్ చాలా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తాడు. లెజండ్ లో జగపతి బాబు, సరైనోడులో ఆది, వినయ విధేయ రామలో వివేక్ ఒబెరాయ్, జగపతి బాబు.. ఇలా తన ప్రతీ సినిమాలో విలన్ కు భారీ సెటప్ ను సెట్ చేస్తాడు. ఈ రీతిలోనే ఇప్పుడు బాలకృష్ణ 106వ చిత్రానికి కూడా స్పెషల్ విలన్ ఉండాలని భావిస్తున్నాడు. కెజిఎఫ్ 2లో తొలిసారి సౌత్ సినిమాల్లో విలన్ గా చేస్తోన్న సంజయ్ దత్ ను ఈ చిత్రానికి విలన్ గా పెట్టాలని అనుకుంటున్నాడు. సంజయ్ దత్ అప్పోయింట్మెంట్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

దాంతో పాటుగా ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను అనుకుంటున్నాడు బోయపాటి. ఆమెను కలిసి కథ కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All