Homeటాప్ స్టోరీస్బాలకృష్ణ అక్కడ జీరో అయిపోయాడే!

బాలకృష్ణ అక్కడ జీరో అయిపోయాడే!

No market for Balakrishnas ruler in overseas
No market for Balakrishnas ruler in overseas

స్టార్ హీరో అన్నాక కొన్ని ఏరియాల్లో బాగా పట్టు ఉంటుంది. ఎలాంటి సినిమా చేసినా ఆ ప్రాంతంలో ఆ హీరో సినిమా కనీస కలెక్షన్స్ ను సాధిస్తుంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే మహేష్ బాబుకు ఓవర్సీస్ లో మంచి పట్టుంది. మహేష్ నటించిన ఎలాంటి సినిమా అయినా అక్కడ మిలియన్ డాలర్ సాధించడం అనేది పక్కా. అసలు ఏ తెలుగు హీరో కూడా మిలియన్ డాలర్ మార్క్ ను అందుకునేందుకు సాహసించని రోజుల్లోనే మహేష్ అక్కడ మిలియన్ డాలర్ సినిమాలతో ఊపు తెచ్చాడు. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలకు సీడెడ్ లో మంచి పట్టు ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన ఎలాంటి సినిమా అయినా సీడెడ్ లో కుమ్మి అవతలపడేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలందరికీ నైజాం, కర్ణాటకలో సూపర్ కలెక్షన్స్ సాధిస్తాయి. అలాగే బలాలతో పాటు బలహీనతలు కూడా  ఉంటాయనడంలో సందేహం లేదు. ఓవర్సీస్, నైజాంలో స్ట్రాంగ్ గా ఉండే మహేష్ కు సీడెడ్ వీక్నెస్. ఎంత హిట్ సినిమా అయినా ఇక్కడ మహేష్ కు మోస్తరు కలెక్షన్స్ మాత్రమే వస్తాయి. అలాగే రామ్ చరణ్ వంటి వారికి ఓవర్సీస్ లో పెద్ద మార్కెట్ లేదు. ప్లాప్ సినిమాలతో కూడా మిలియన్ డాలర్ మార్క్ సాధించలేడు చరణ్. అలాగే నందమూరి బాలకృష్ణకు కూడా ఓవర్సీస్ వీక్ ఏరియాగా మిగిలిపోయింది.

సాధారణంగా బాలకృష్ణ సినిమాలంటే అన్ని వర్గాల వారికి ఎక్కే అవకాశాలు తక్కువే. కేవలం ఫ్యాన్స్ కోసమే ఆయన సినిమాల్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. పైగా బాలకృష్ణ సినిమాలు మాస్ మసాలాతో నిండిపోయి ఉంటాయి. ఇవి ఓవర్సీస్ ప్రేక్షకుల అభిరుచికి చాలా దూరం. అందుకే బాలకృష్ణ ఎప్పుడూ ఓవర్సీస్ లో భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించించి లేదు. తన కెరీర్ లో కేవలం ఒకే ఒక్క సినిమాతో 1 మిలియన్ డాలర్ మార్క్ ను అందుకున్నాడు బాలకృష్ణ. అది కూడా క్రిష్ పుణ్యమే. గౌతమిపుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ సినిమాతో ఈ ఫీట్ సాధ్యమైంది. దాని తర్వాత కూడా కనీసం 2 – 3 లక్షల డాలర్లు అందుకోవడానికి కూడా బాలకృష్ణ తడబడ్డాడు. డిక్టేటర్ సినిమా అయితే అక్కడ రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. ఇక జైసింహకు వచ్చిన వసూళ్ల గురించి చర్చించుకోవడం కూడా దండగే. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాల ద్వారా కూడా నామమాత్రపు వసూళ్లు వచ్చాయక్కడ.

- Advertisement -

దీంతో నందమూరి బాలకృష్ణ మార్కెట్ అక్కడ సున్నాగా మారిందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తోన్న రూలర్ సినిమాకైతే ఇక్కడ బయ్యర్లు కూడా దొరకట్లేదు. ఈ సినిమాను కొనే సాహసం చేయలేకపోతున్నారు. రూలర్ టీజర్ చూసిన ఎవరికైనా ఇది రొటీన్ వ్యవహారమే అని అర్ధమవుతుంది. అందుకే బయ్యర్లు అక్కడ సినిమాను కొనడానికి సాహసం చేయలేకపోతున్నారు. అలా అని డొమెస్టిక్ మార్కెట్ లో కొదవేం లేదు. ఇక్కడ ఫుల్ క్రేజ్ ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All