
`పద్మశ్రీ` బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, `మత్తు వదలరా` ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `పంచతంత్రం`. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. అఖిలేష్ హర్షవర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హర్ష పులిపాక ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
సోమవారం విలక్షణ నటుడు సముద్రఖని పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ఆయన రామనాథం పాత్రలో కనిపించబోతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ `సముద్రఖనిగారికి జన్మదిన శుభాకాంక్షలు. గొప్ప నటుడు, గొప్ప వ్యక్తి మా సినిమాలో నటించడం మాకు ఎంతో సంతోషంగా వుంది. ఓ నటుడిగా ఆయనతో కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. సినిమా చిత్రీకరణ మరో పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ మినహా చాలా వరకు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాం` అని తెలిపారు.
హర్ష పులిపాక మాట్లాడుతూ `పంచేంద్రియాల చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఇందులో సముద్రఖని రామనాథం అనే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్‌గా నటిస్తున్నారు. ఈ ఏడాది `క్రాక్`, అంతకు ముందు `అల వైకుంఠపురములో` వంటి చిత్రాల్లో సముద్రఖని పవర్‌ఫుల్ విలన్ పాత్రల్లో నటించారు. అయితే మా సినిమాలో సముద్రఖని హీరోగా కనిపిస్తారు. 60 ఏళ్ల రామనాథం పాత్ర సినిమా చూస్తున్న ప్రతి యంగ్ స్టర్‌కి తన తండ్రిని గుర్తు చేసేలా వుంటుంది` అన్నారు.
Here’s @thondankani as Ramanatham ✨
Team #Panchathantram wishes the versatile actor #Samuthirakani a very Happy Birthday! ????#HBDSamuthirakani pic.twitter.com/gs5VviLZIn
— RIAZ K AHMED (@RIAZtheboss) April 26, 2021