Homeటాప్ స్టోరీస్సోహైల్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన బ్ర‌హ్మానందం!

సోహైల్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన బ్ర‌హ్మానందం!

సోహైల్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన బ్ర‌హ్మానందం!
సోహైల్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన బ్ర‌హ్మానందం!

బిగ్‌బాస్ సీజ‌న్ 4 ర‌స‌వ‌త్త‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో ముగిసింది. ఊహించిన‌ట్టుగానే అభిజీత్ ఫైన‌లిస్టుగా విజేత‌గా నిలిచి ట్రోఫీని ద‌క్కించుకున్నాడు. చిరు ప్ర‌శంస‌ల్ని ద‌క్కించుకున్నాడు. చివ‌రి వ‌ర‌కు అభిజీత్‌తో పోటీప‌డిన అఖిల్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. అయితే ఈ షోలో అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్న సోహైల్ తెలివిగల నిర్ణ‌యం తీసుకుని 25 ల‌క్ష‌ల‌తో అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష‌యం తెలిసిందే.

టాప్‌3లో వున్న సోహైల్ ఫైన‌ల్‌కి వెళ్లేది ఒక్క‌రే 25 ల‌క్ష‌లు తీసుకుని పోటీ నుంచి త‌ప్పుకోవ‌చ్చ‌ని ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో సోహైల్ గోల్డెన్ బ్రీఫ్ కేస్‌ని తీసుకుని పోటీ నుంచి త‌ప్పుకున్నాడు. అత‌ని నిర్ణ‌యాన్ని అంతా స‌మ‌ర్ధించి సోహైల్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. హౌస్‌లో సోహైల్ ఆట‌తీరు న‌చ్చ‌డంతో చిరు ముచ్చ‌ట‌ప‌డ్డారు. అత‌నికి త‌న ఇంటిలో ఫ్యాన్స్ వున్నార‌న్న చిరు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. సోహైల్ సినిమా చేస్తే దాని ప్రారంభోత్స‌వానికి వ‌స్తాన‌ని, అంతే కాకుండా అతిథి పాత్ర‌లో కూడా న‌టిస్తాన‌ని హామీ ఇచ్చారు. కోట్ల మంది స‌మ‌క్షంలో నీకిచ్చిన‌ మాట‌ని నెర‌వేరుస్తాన‌ని చిరు చెప్పిన విష‌యం తెలిసిందే.

- Advertisement -

తాజాగా ఇలాంటి ఆఫ‌ర్‌నే హాస్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం .. సోహైల్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. సోహైల్ సినిమాలో త‌ను కూడా అతిథి పాత్ర‌లో న‌టిస్తాన‌ని, అందుకు ఎలాంటి పారితోషికం కూడా తీసుకోన‌ని స్ప‌ష్టం చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. సింగ‌రేణి ముద్దుబిడ్డ అంటూ బిగ్‌బాస్ వేదిక‌గా హంగామా చేసిన సోహైల్ కెరీర్ కొత్త మ‌లుపు తిర‌గ‌డం ఖాయం అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All