Homeటాప్ స్టోరీస్సుశాంత్ ప్రేమించింది రియాను కాదా?

సుశాంత్ ప్రేమించింది రియాను కాదా?

సుశాంత్ ప్రేమించింది రియాను కాదా?
సుశాంత్ ప్రేమించింది రియాను కాదా?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్ప‌ద మృతి రోజుకో మ‌లుపు తిరుగుతోంది. తాజాగా సుశాంత్ సింగ్‌కి సంంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌ప‌డింది. గ‌త కొంత కాలంగా రియా చ‌క్ర‌వ‌ర్తి, సుశాంత్ సింగ్ డేటింగ్ చేశార‌ని, ఆ త‌రువాత రియా అత‌ని నుంచి విడిపోయిన త‌రువాతే సుశాంత్ అనుమానాస్ప‌దంగా మృతి చెందార‌ని వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా అందుకు భిన్న‌మైన వార్త ఒక‌టి బ‌య‌టికి రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా సుశాంత్ ఫ్రెండ్ శామ్యూల్ హోకిప్‌ వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `కేదార్‌నాథ్‌` మూవీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో సుశాంత్, సారా అలీఖాన్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని, `సోంచిరియా` చిత్రం విడుద‌ల త‌రువాత ఇద్ద‌రూ విడిపోయార‌ని, దీని వెన‌క బాలీవుడ్ మాఫియా వుండి వుండ‌వ‌చ్చ‌ని శామ్యూల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించ‌డం బాలీవుడ్‌లో ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తోంది.

- Advertisement -

ఈ వ్య‌వ‌హారంపై ఫైర్ బ్రాండ్ కంగ‌న ర‌నౌత్ కూడా స్పందించింది. సుశాంత్‌, సారా అలీఖాన్‌ల ప్రేమ వ్య‌వ‌హారం గురించి మీడియాకు తెలుస‌ని, అవుట్ డోర్ షూటింగ్‌ల‌కు వెళ్లిన‌ప్పుడు వారిద్ద‌ర క‌లిసి ఒకే రూమ్‌లో వుండేవార‌ని, ఇలాంటి వ్య‌క్తులు ఆ త‌రువాత వారిని ఎందుకు వ‌దిలేస్తున్నార‌ని కంగ‌న ప్ర‌శ్నించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. మ‌రి ఈ వివాదంపై సారా అలీఖాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All