Homeటాప్ స్టోరీస్సారా అలీఖాన్‌కు షాకిచ్చిన అభిమాని!

సారా అలీఖాన్‌కు షాకిచ్చిన అభిమాని!

Fan shocked sara ali khan
Fan shocked sara ali khan

అభిమానం హ‌ద్దులు దాటితే ఎలా వుంటుందో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సైఫ్ అలీఖాన్ గారాల ప‌ట్టి సారా అలీఖాన్‌కు కెరీర్ ప్రారంభంలోనే అనుభ‌వం అయింది. `కేదార్‌నాథ్‌` చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన సారా అలీఖాన్ ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయినా మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. ర‌ణ్‌వీర్‌సింగ్ తో క‌లిసి న‌టించిన `శింబా` చిత్రంతో తొలి విజ‌యాన్ని సొంతం చేసుకున్న సారా ప్ర‌స్తుతం రెండు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వుంది.

షూటింగ్ గ్యాప్ దొర‌క‌డంతో త‌ల్లి, సోద‌రుడితో క‌లిసి మాల్దీవుల‌కు వెకేష‌న్‌కి వెళ్లి అక్క‌డి అందాల్ని ఆస్వాదించిన సారా ఆ ట్రిప్‌కు సంబంధింన ఫొటోల్ని సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో అభిమానుల కోసం షేర్ చేసింది. త‌న టూర్‌ని ముగించుకుని తిరిగి ముంబై చేరుకున్న సారా డైలీ వ‌ర్క‌వుట్‌ల కోసం ఓ జిమ్‌కి వెళ్లేందుకు బ‌య‌టికి వ‌చ్చింది. భారీగా సెక్యూరిటీ వున్నా అభిమానులు సారాని చూడ‌టానికి ఎగ‌బ‌డ‌టంతో వారి వ‌ద్ద‌కే వెళ్లి ప‌ల‌క‌రించే ప్ర‌య‌త్నం చేసింది.

- Advertisement -

దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న ఓ అభిమాని సారా చేయి అందుకుని ముద్దాడ‌బోయాడు. దీంతో క్ష‌ణాల్లో తేరుకున్న సారా బాడీగార్డ్స్ మెరుపు వేగంతో స్పందించి సారా చేయిని విడిపించి స‌ద‌రు అభిమానిని ప‌క్క‌కు తోసేశారు. బ‌డితె పూజ గ్యారెంటీ అని తెలుసుకున్న స‌ద‌రు అభిమాని అక్క‌డి నుంచి ప‌రుగందుకున్నాడు. ఈ హ‌ఠాత్ప‌రిణామానికి సారా షాక్‌కు గురైంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All