
మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ `క్రాక్`. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలచింది. ఈ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ తనదైన స్టైల్లో అదరగొట్టేశారు.
పోతురాజు వీరశంకర్‌కు పాత్రకు ధీటుగా విలన్ పాత్రలో సముద్రఖని నటించారు. కఠారి కృష్ణ పాత్రలో ఆయన అభినయానికి కూడా ప్రశంసలు లభించాయి. అదే స్థాయిలో ఆయనకు ఆఫర్లు కూడా భారీ స్థాయిలోనే లభిస్తున్నాయి. తాజాగా సముద్రఖనికి క్రేజీ మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశం లభించినట్టు తెలిసింది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రానాల కలయికలో ఓ మల్టీస్టారర్ రూపొందుతున్న విషయం తెలిసిందే.
`అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోని కీలక పాత్రలో సముద్రఖనిని తీసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సముద్రఖని ఇటీవల వెల్లడించారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వత్వరలో ప్రారంభం కాబోతోంది.