Homeటాప్ స్టోరీస్`క్రాక్‌` సండే దుమ్ము దులిపేసింది!

`క్రాక్‌` సండే దుమ్ము దులిపేసింది!

`క్రాక్‌` సండే దుమ్ము దులిపేసింది!
`క్రాక్‌` సండే దుమ్ము దులిపేసింది!

లేట్‌గా వ‌చ్చినా లేటెస్ట్‌గా వ‌చ్చేస్తా అన్న‌ట్టు మాస్‌ మ‌హారాజా ర‌వితేజ `క్రాక్‌` దుమ్ము దులిపేస్తోంది. శ‌నివారం ఉద‌యం ఆట‌తో ప్రారంభం కావాల్సిన ఈ మూవీ చిత్ర నిర్మాత బి. మ‌ధు వ‌ల్ల ఏర్ప‌డిన ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా రిలీజ్ ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు ఆర్ఠిక ఇబ్బందులు తొల‌గిపోవ‌డంతో శ‌నివారం ఫ‌స్ట్ షోతో థియేట‌ర్ల‌లో ఈ మూవీ హంగామా మొద‌లైంది.

తొలి షో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకోవ‌డంతో చిత్ర బృందం ఊప‌రి పీల్చుకుంది. డాన్ శీను, బ‌లుపు వంటి రెండు హిట్‌ల త‌రువాత గోపీచంద్ మ‌లినేని, ర‌వితేజ‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఈ చిత్రం అనుకున్న‌ట్టే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సాధించి ఈ కాంబినేష‌న్‌కి హ్యాట్ర‌క్ హిట్‌ని అందించింది. శ‌నివారం ఫ‌స్ట్ షోతో మొద‌లైన ఈ మూవీ సండే వీకెండ్ కావ‌డంతో ఫుల్స్ అయిపోయింది. సింగిల్ స్క్రీన్స్‌, మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్స్ అని తేడా లేకుండా ఆదివారం ఈ మూవీ ప్ర‌ద‌ర్శిస్తున్న థియేట‌ర్ల‌న్నీ 60 నుంచి 70 శాతం ఫుల్స్ కావ‌డం విశేషం.

- Advertisement -

తెలంగాణ‌, ఏపీల్లో ఈ మూవీ రిలీజైన థియేట‌ర్ల‌న్నీ మ్యాగ్జిమ‌మ్ 60 నుంచి 70 శాతం ఫుల్ కావ‌డం శుభ‌ప‌రిణామ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఫ‌లితంతో సంక్రాంతి రోజున విడుద‌ల‌వుతున్న చిత్రాల‌కు మంచి ధైర్యం వ‌చ్చింద‌ని, పండ‌గ పూట కొత్త చిత్రాల కోసం ప్రేక్ష‌కులు భారీ సంఖ్య‌లో ధియేట‌ర్ల‌కు రావ‌డం ఖాయ‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All