Homeగాసిప్స్బ‌ర్నింగ్ స్టార్ `బ‌జారురౌడీ` మోష‌న్ పోస్ట‌ర్‌!

బ‌ర్నింగ్ స్టార్ `బ‌జారురౌడీ` మోష‌న్ పోస్ట‌ర్‌!

Sampoornesh babu`s Bajaru rowdy motion poster released
Sampoornesh babu`s Bajaru rowdy motion poster released

హృద‌య‌కాలేయం, కొబ్బ‌రి మ‌ట్ట లాంటి విచిత్ర‌మైన టైటిల్స్‌తో విభిన్న‌మైన సినిమాల‌తో ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `బ‌జారు రౌడీ`. వ‌సంత నాగేశ్వ‌ర‌రావు దర్శ‌‌క‌త్వం వ‌హిస్తున్నారు. సందిరెడ్డి శ్రీ‌నివాస‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ని తాజాగా రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ ` చాలా రోజుల త‌రువాత నేను ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఇలా మాట్లాడ‌టం సంతోషంగా వుంది. నాలుగు సినిమాల్లో న‌టించాను. ఇది నా ఐద‌వ సినిమా. నా ప్ర‌తి సినిమాను ఆద‌రించిన ప్రేక్ష‌కులు ఈ సినిమాను కూడా స‌క్సెస్ చేస్తార‌ని ఆశిస్తున్నాను. ఈ చిత్రానికి ప‌నిచేసిన అంద‌రికి ధ‌న్య‌వాదాలు` అన్నారు.

- Advertisement -

అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలుసుకుని 150 రూపాయ‌లు పెట్టి టికెట్ కొని వ‌చ్చే ప్రేక్ష‌కుడిని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని ఆద్యంతం వినోదాత్మ‌కంగా సినిమాని తీర్చిదిద్దాం. మంచి క‌థ‌, క‌థ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న `బ‌జారు రౌడీ` సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను అలరిస్తుంద‌ని ఆశిస్తున్నాను` అని ద‌ర్శ‌కుడు వ‌సంత నాగేశ్వ‌ర‌రావు తెలిపారు.

నిర్మాత సందిరెడ్డి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ ` సినిమా బాగా వ‌చ్చింది. సంపూర్ణేష్‌బాబు మ‌రో అద్భుత‌మైన పాత్ర‌లో న‌టించారు. క‌రాటే క‌ల్యాణీ, ఫృథ్వీ, నాగినీడు.. ఇలా చాలా మంది మంచి పాత్ర‌ల్లో న‌టించారు. విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. సినిమాకు కూడా అదే త‌ర‌హా స్పంద‌న ల‌భిస్తుంద‌ని భావిస్తున్నాను` అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All