Homeటాప్ స్టోరీస్ఊహాన్ గ‌బ్బిలాల మార్కెట్‌లో సంపూ హంగామా!

ఊహాన్ గ‌బ్బిలాల మార్కెట్‌లో సంపూ హంగామా!

ఊహాన్ గ‌బ్బిలాల మార్కెట్‌లో సంపూ హంగామా!
ఊహాన్ గ‌బ్బిలాల మార్కెట్‌లో సంపూ హంగామా!

చైనాలోని ఊహాన్ నగ‌రంలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్రస్తుతం యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఏ దేశ వార్త‌లు విన్నా క‌రోనా మ‌ర‌ణాలే. క‌రోనా పాజిటివ్ కేసులే. దీని కార‌ణంగా ప్ర‌జా జీవితం ‌స్థంభించిపోయింది. ఈ వైర‌స్ ఊహాన్‌లోని గ‌బ్బిలాల మార్కెట్ నుంచి పుట్టింద‌ని, లేదా అక్క‌డే వున్న లాబ్ నుంచి ఉద్భ‌వించింద‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే మే 9 న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సంచ‌ల‌నంగా మారింది.

వైర‌స్ పుట్టిన ఊహాన్ న‌గ‌రంలో షూటింగ్ జ‌రుపుకున్న చివ‌రి సినిమా అంటూ సంపూతో సినిమా చేస్తున్న చిత్ర బృందం శ‌నివారం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సంపూర్ణేష్‌బాబు న‌టిస్తున్న తాజా చిత్రం `?`. నోలాన్ మౌళి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అమృత ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

- Advertisement -

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికించ‌డానికి ముందు ఊహాన్ మార్కెట్‌లో ఈ చిత్రాన్ని షూట్ చేశామ‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. అది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అన్న‌ది సినిమా చూస్తే కానీ తెలియ‌దు. ఏదిఏమైనా క‌రోనా మ‌హ‌మ్మారిని సంపూ టీమ్  ఇలా వాడుకుంటున్నార‌న్న‌మాట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All