HomeVideosన‌వ్వులు పూయిస్తున్న సంపూ `బ‌జారు రౌడీ`!

న‌వ్వులు పూయిస్తున్న సంపూ `బ‌జారు రౌడీ`!

న‌వ్వులు పూయిస్తున్న సంపూ `బ‌జారు రౌడీ`!
న‌వ్వులు పూయిస్తున్న సంపూ `బ‌జారు రౌడీ`!

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం `బ‌జారు రౌడీ`. `హృద‌య కాలేయం`, కొబ్బ‌రి మ‌ట్ట వంటి విచిత్ర‌మైన టైటిల్స్‌తో హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌ని అందించి త‌న‌కంటూ మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న సంపూర్ణేష్ బాబు న‌టిస్తున్న చిత్ర‌మిది. వ‌సంత నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. మ‌హేశ్వ‌రి మ‌ద్ది హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ మ‌మూవీ టీజ‌ర్‌ని గురువారం విడుద‌ల చేశారు.

`రౌడీయిజం చేయాలంటే జీవు.. జీపులో పెట్రోలు.. దానిలో రౌడీలు కాదురా… ద‌మ్ము కావాలి` అంటూ  టీజ‌ర్‌లో సంపూర్ణేష్‌బాబు చెబుతున్న డైలాగ్‌లో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మైత్రీ మూవీస్ నిర్మాత న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ `టీజ‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా వుంది. సంపూర్ణేష్ న‌టించిన గ‌త చిత్రాలు `హృద‌య కాలేయం`, కొబ్బ‌రి మ‌ట్ట వంటి చిత్రాల త‌ర‌హాలోనే ఈ మూవీ కూడా పెద్ద విజ‌యం సాధించాలి` అన్నారు.  ‌

- Advertisement -

సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ ` ఒక చిన్న న‌టుడిని ఆద‌రించిన ప్రేక్ష‌కులు `బ‌జారు రౌడీ`ని కూడా త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా. నా నుంచి ప్రేక్ష‌కులు ఏమైతే ఆశిస్తారో వాటికి మించిన కంటెంట్ ఈ సినిమాలో వుంది.  మా నిర్మాత ఇందులో చాలా పేరున్న ఆర్టిస్ట్‌ల‌ను తీసుకుని వారితో నేను న‌టించే అవ‌కాశం ఇచ్చారు. ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ బెస్ట్ ఇచ్చారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాతో మీ ముందుకు వ‌స్తా` అన్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All