Homeటాప్ స్టోరీస్ఇక హోస్ట్‌గా ర‌చ్చ చేస్తుంద‌ట‌!

ఇక హోస్ట్‌గా ర‌చ్చ చేస్తుంద‌ట‌!

ఇక హోస్ట్‌గా ర‌చ్చ చేస్తుంద‌ట‌!
ఇక హోస్ట్‌గా ర‌చ్చ చేస్తుంద‌ట‌!

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 4 కోసం గ‌త వారం నాగ్ ప్లేస్‌లో స‌మంత హోస్ట్‌గా మారి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. `వైల్డ్ డాగ్‌` షూటింగ్ కోసం కింగ్ నాగార్జున హిమాల‌యాల‌కు వెళ్ల‌డంతో ఓ వారం నాగార్జున ప్లేస్‌లో స‌మంత‌ని తీసుకురావ‌డం మేక‌ర్స్‌కి అనివార్యం అయింది. దీంతో విజ‌య‌ద‌శ‌మి రోజున బిగ్‌బాస్ సీజ‌న్ 4 కోసం స‌మంత హోస్ట్ అవ‌తారం ఎత్తింది.

ఈ ఎపిసోడ్ హిట్ కావ‌డంతో హోస్ట్ గా మ‌రో షోని సామ్ నిర్వ‌హించ‌డానికి రెడీ అయిపోయింది. టీవీ, డిజిటల్ మాధ్యమాలలో టాక్ షోలను విజయవంతంగా నిర్వహించిన కరణ్ జోహార్, నేహా ధూపియా వంటి బాలీవుడ్ ప్రముఖులను సమంతా ఈ సంద‌ర్భంగా ఫాలో అవుతోంద‌ట‌.

- Advertisement -

చావుకి ద‌గ్గ‌ర‌గా వెళ్లి జ‌యించిన వారితో స‌మంత ఈ షోని నిర్వ‌హించ‌బోతోంది. కాన్సెప్ట్ పాత‌దే అయినా స‌మంత హోస్ట్‌గా చేస్తుండ‌టంతో దీనికి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ఈ షోని స‌మంత `ఆహా` ఓటీటీ కోసం చేస్తుండ‌టం మ‌రింత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.  వీవ‌ర్స్‌ని పెంచుకోవాల‌నే ప్లాన్‌లో భాగంగా ఆహా సామ్‌తో ఈ షోని స్టార్ట్ చేస్తోంది. ఇప్పటికే స‌మంత ఈ  షో షూటింగ్ ని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో  ప్రారంభించింది. ఈ షోకు  సంబంధించిన మరిన్ని వివరాలను అల్లు అరవింద్, సమంతా ఈ శుక్ర‌వారం ప్రకటించనున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All