
టాలీవుడ్‌లో సమంతకున్న మార్కెట్.. పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి తరువాత కూడా అదే క్రేజ్‌ని కొనసాగిస్తున్న ఏకైక నటి సమంతేనేమో. `రంగస్థలం నుంచి విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ తన పంథా మార్చుకున్న సమంత `ఫ్యామిలీ మ్యాన్ 2` సిరీస్‌తో సరికొత్త ఇమేజ్‌కి రెడీ అవుతోంది. ఆమె నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోంది.
ఇదిలా వుంటే సమంత మామగారు.. హీరో అక్కినేని నాగార్జున ఎంత కమర్షియల్ గా ఆలోచిస్తారో అందరికి తెలిసిందే. ఆయన చేసినన్ని కమర్షయల్ యాడ్స్.. కమర్షయిల్ డీలింగ్స్ టాలీవుడ్‌లో ఏ హీరో చేసివుండరేమో. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 4కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగ్ స్పోర్టీఫై.. ఘడీ డిటర్జంట్.. కల్యాణ్ జు్యవెల్లర్స్.. ఇలా చాలా వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.. సామ్ కూడా దాదాపుగా మామకు పోటీనిస్తోంది.
తాజాగా ఆమె `సాకి` పేరుతో కొత్త బ్రాండ్‌ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. పలు బ్రాండ్‌లకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సామ్ తన సొంత బ్రాండ్‌కు కూడా తనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. తాజాగా కుర్తా పైజామా స్టైల్‌ని రిలీజ్ చేసింది. టాప్ టు బాటమ్ ఒకేలా వుండేలా బ్రౌన్ కలర్‌లో కుర్తా పైజమాని డిజైన్ చేశారు. ఈ డ్రెస్‌లో సామ్ హోయలు పోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు పెట్టింట్లో సందడి చేస్తున్నాయి. సామ్‌ని చూసిన వాళ్లంతా మామకు తగ్గ కోడలు అంటూ కామెంట్‌లు చేస్తున్నారు.