Homeటాప్ స్టోరీస్గ్లామర్ వరల్డ్ నుండి లాంగ్ బ్రేక్ తీసుకున్న సమంత

గ్లామర్ వరల్డ్ నుండి లాంగ్ బ్రేక్ తీసుకున్న సమంత

 

samantha to take long break from films
samantha to take long break from films

సమంత కెరీర్ ఇప్పుడు గోల్డెన్ ఫేజ్ లో ఉంది. ఆమె నటించిన ఓ బేబీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అలాగే వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో హ్యుజ్ రిసెప్షన్ వచ్చింది. ఆమె పాత్రకు కొంత నెగటివిటీ వచ్చినా కానీ రిసెప్షన్ కూడా దానికి డబల్ రీతిలో రావడంతో సమంత చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్ గా సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాను పూర్తి చేసింది. ప్రస్తుతం తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో నయనతార కూడా మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

- Advertisement -

విగ్నేష్ శివం డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే సమంత సినిమాల నుండి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది సమంత. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించబోతున్నట్లు, అందుకే సినిమాల నుండి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All