
బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా ఇప్పుడు బాగా స్లిమ్ ఐంది. దాంతో పాటు గ్లామరస్ డోస్ కూడా బాగా పెంచేసింది. ఈ మధ్య తన రీసెంట్ ఫోటోషూట్స్ చూస్తే ఈ విషయం అర్ధమవుతోంది. సినిమాలతో పాటు రాశి ఖన్నా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం రెండు హిందీ వెబ్ సిరీస్ లను ఓకే చేసింది రాశి. అందులో ఒకటి షూటింగ్ దశలో ఉంది.
షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్ ను రాజ్ – డీకే ద్వయం తెరకెక్కిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈరోజు నుండి విజయ్ సేతుపతి సెట్స్ లో పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని రాశి ఖన్నా తెలియజేసింది. “నా ఫెవరెట్ విజయ్ సేతుపతితో మూడోసారి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఈసారి హిందీలో” అని రాశి ఖన్నా పోస్ట్ చేసింది.
గతంలో విజయ్ సేతుపతి, రాశి ఖన్నా రెండు తమిళ్ చిత్రాల్లో కలిసి నటించారు.