Homeటాప్ స్టోరీస్సమంత, తమన్నా, పూజ, కాజల్ లను దాటేసిన రష్మిక

సమంత, తమన్నా, పూజ, కాజల్ లను దాటేసిన రష్మిక

సమంత, తమన్నా, పూజ, కాజల్ లను దాటేసిన రష్మిక
సమంత, తమన్నా, పూజ, కాజల్ లను దాటేసిన రష్మిక

రష్మిక మందన్న చాలా తక్కువ కాలంలోనే సూపర్ స్టార్డంను అందుకుంది. వరసగా సూపర్ హిట్స్ అందుకుని టాప్ స్టార్స్ తో నటిస్తోంది. నేషనల్ క్రష్ గా కూడా పరిగణింపబడిన రష్మిక మందన్న పాపులారిటీ రోజురోజుకూ పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో సైతం ఆమెకు బోలెడంత పాపులారిటీ వస్తోంది.

ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రష్మిక ఒక రేర్ ల్యాండ్ మార్క్ ను అందుకుంది. ఇన్స్టాలో 20 మిలియన్ ఫాలోయర్స్ ను సాధించింది రష్మిక మందన్న. తద్వారా సమంత, పూజ హెగ్డే, తమన్నాలను దాటేసింది. సమంతకు 18 మిలియన్ ఫాలోయర్స్ ఉండగా పూజ హెగ్డే, తమన్నాలకు 14 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. కాజల్ కు 19 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.

- Advertisement -

రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తోంది. ఇక హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలను లైన్లో పెట్టింది. తెలుగులో మరిన్ని అవకాశాలను అందుకోనుంది రష్మిక.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All