Homeటాప్ స్టోరీస్ఆ సినిమా చూడమంటే సమంత భయపడిందట

ఆ సినిమా చూడమంటే సమంత భయపడిందట

samantha over action about chilasow filmరాహుల్ దర్శకత్వం వహించిన ” చి ల సౌ ” చిత్రాన్ని చూడమని సమంత ని కోరినప్పుడు అయ్యో ! సినిమా చూడాలా ? చూసి ఎలా చెప్పాలి …… ఏమని చెప్పాలి అని భయపడిందట సమంత . అయితే సినిమా చూశానని చాలా బాగుందని , సినిమా చూస్తూ సంతోషంతో కన్నీళ్ల ని ఆపుకోలేక పోయానని అంటోంది సమంత . అంతేనా …… రాహుల్ నాకు పదకొండేళ్ళుగా స్నేహితుడు అయితే అతడు నటుడిగా సక్సెస్ కాలేదు కానీ దర్శకుడిగా మాత్రం బాగా కనెక్ట్ అయ్యాడని కితాబు నిస్తోంది . సమంత హీరోయిన్ కాకముందు నుండి రాహుల్ మంచి స్నేహితుడట దాంతో ఆమె కెరీర్ ని బాగా ప్లాన్ చేసుకోవడంలో రాహుల్ పాత్ర ఉందని అందుకే అతడు నటుడిగా సక్సెస్ కాకపోయినప్పటికీ దర్శకుడిగా నైనా సక్సెస్ కావాలని ఆశపడుతోంది సమంత .

రాహుల్ రవీంద్రన్ తెలుగులో అలాగే తమిళ్ లో పలు చిత్రాల్లో నటించాడు హీరోగా , సహాయ నటుడిగా కానీ అనుకున్న స్థాయిలో మాత్రం రాణించలేకపోయాడు . కట్ చేస్తే ఇప్పుడు ”చి ల సౌ ” చిత్రంతో దర్శకుడిగా మారాడు . ఇక ఈ సినిమాని నిర్మించింది అన్నపూర్ణ స్టూడియో కావడం విశేషం . దాంతో ఈ సినిమాని నెత్తిమీద పెట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు సమంత , నాగచైతన్య లు . ఇక ఈ సినిమాలో హీరోగా అక్కినేని మనవడు సుశాంత్ నటించాడు అలాగే ఈనెల 3న చిలసౌ విడుదలకు సిద్ధం అయ్యింది . ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే . అన్నట్లు సమంత మొత్తం సినిమా చూడలేదట కేవలం సగం చూసి బాగుందని అంటోంది మరి మిగతా సగం మాటేమిటో !

- Advertisement -

English Title: samantha over action about chilasow film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All