Homeగాసిప్స్ప్రాజెక్ట్ కె సమంత న్యూస్ ఒట్టి రూమరేనా?

ప్రాజెక్ట్ కె సమంత న్యూస్ ఒట్టి రూమరేనా?

ప్రాజెక్ట్ కె సమంత న్యూస్ ఒట్టి రూమరేనా?
ప్రాజెక్ట్ కె సమంత న్యూస్ ఒట్టి రూమరేనా?

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అత్యంత బిజీగా ఉంటున్నాడు. ఏకంగా నాలుగు ప్యాన్ ఇండియా చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు. రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న ప్రాజెక్ట్ కె షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో షార్ట్ షెడ్యూల్ ను మొదలుపెట్టారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అమితాబ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు.

ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కె లో సమంత కీలక పాత్ర పోషిస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని సమాచారం. ప్రాజెక్ట్ కె లో ఇంకా ఎవరినీ అధికారికంగా తీసుకోలేదు. అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ ఈ సినిమాలో నటించేది కూడా ఒట్టి రూమర్.

- Advertisement -

బాలీవుడ్ టాప్ నటి దీపికా పదుకోన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రాజెక్ట్ తో పాటు ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్ చిత్రాలను కూడా చేస్తోన్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All