Homeటాప్ స్టోరీస్ప్రభాస్ ప్యాన్ ఇండియా చిత్రంలో సమంత నటించనుందా?

ప్రభాస్ ప్యాన్ ఇండియా చిత్రంలో సమంత నటించనుందా?

ప్రభాస్ ప్యాన్ ఇండియా చిత్రంలో సమంత నటించనుందా?
ప్రభాస్ ప్యాన్ ఇండియా చిత్రంలో సమంత నటించనుందా?

ఇండియాలో బిజీగా ఉన్న నటుల్లో ప్రస్తుతం ప్రభాస్ ముందు వరసలో ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న నాలుగు ప్యాన్ ఇండియా చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. రాధే శ్యామ్ ను దాదాపుగా పూర్తి చేసేసాడు ప్రభాస్. ఇక సలార్, ఆది పురుష్ చిత్రాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె ను మొదలుపెట్టాడు. ప్రాజెక్ట్ కె అన్నది వర్కింగ్ టైటిల్ గా వ్యవహరిస్తున్నారు.

రీసెంట్ గా హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అమితాబ్ కూడా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సమంత నటించనుందని తెలుస్తోంది. ఒక కీలక పాత్ర కోసం ఆమెను సంప్రదించగా వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అలాగే మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను కూడా కీలక పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All