Homeటాప్ స్టోరీస్ఫ్యామిలీ మ్యాన్ 2 రివ్యూస్ కు సంతోషంలో తేలిపోతోన్న సమంత

ఫ్యామిలీ మ్యాన్ 2 రివ్యూస్ కు సంతోషంలో తేలిపోతోన్న సమంత

ఫ్యామిలీ మ్యాన్ 2 రివ్యూస్ కు సంతోషంలో తేలిపోతోన్న సమంత
ఫ్యామిలీ మ్యాన్ 2 రివ్యూస్ కు సంతోషంలో తేలిపోతోన్న సమంత

ఇండియన్ వెబ్ సిరీస్ లో టాప్ అనదగ్గ ది ఫ్యామిలీ మ్యాన్ కొత్త సీజన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. సెకండ్ సీజన్ కు పాజిటివ్ రివ్యూస్ అన్ని వైపులా నుండి వచ్చాయి. ఈ సీజన్ లో సమంత కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. రాజి పాత్రలో సమంత కనిపించింది. తమిళ ఈలం సభ్యురాలు రాజి పాత్రలో సమంత నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ రివ్యూస్ ను చూసి సమంత ఆనందంలో తేలిపోతోంది. ఇన్స్టాగ్రామ్ లో పెద్ద పోస్ట్ ను పెట్టింది. “ది ఫ్యామిలీ మ్యాన్ 2 రివ్యూలను చూస్తుంటే నా మనసంతా సంతోషంతో నిండిపోతోంది. రాజి పాత్ర ఎప్పుడూ నా మనసుకు దగ్గరగా ఉంటుంది. మొదట రాజ్ అండ్ డీకే ఈ పాత్ర గురించి నాతో డిస్కస్ చేసినప్పుడు ఇది చాలా ఛాలెంజింగ్ అని నాకు అనిపించింది. ఆ తర్వాత వాళ్ళ టీమ్ డాక్యూమెంటరీలను పంపించారు. అది చదువుతునప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఈలం సభ్యులు పడిన కష్టాలను ఈ ప్రపంచం ఎలా విస్మరించింది అనిపించింది” అని సమంత షేర్ చేసింది.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All