Monday, January 17, 2022
Homeటాప్ స్టోరీస్ది ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదంపై స్పందించిన మేకర్స్

ది ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదంపై స్పందించిన మేకర్స్

ది ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదంపై స్పందించిన మేకర్స్
ది ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదంపై స్పందించిన మేకర్స్

గత కొంత కాలంగా ది ఫ్యామిలీ మ్యాన్ 2 గురించి ఎన్నో వివాదాలు షికార్లు చేస్తోన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ఈ ట్రైలర్ విడుదలయ్యాక వివాదాలు మరింత ముదిరిపోయాయి. ఈ సిరీస్ లో తమిళులను కించపరిచే విధంగా చూపించారని, తమిళుల పోరాటాలను టెర్రరిస్టులుగా చూపించడం తమిళుల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు. తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ వెబ్ సిరీస్ ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది.

- Advertisement -

విషయం మరింత ముదురుతుండడంతో ది ఫ్యామిలీ మ్యాన్ 2 మేకర్స్ రాజ్ అండ్ డీకే రంగంలోకి దిగారు. వివాదానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. “ట్రైలర్ లో కొన్ని షాట్స్, సీన్స్ చూసి చాలా ఊహించుకున్నారు. మా సిరీస్ లో కాస్ట్ అండ్ క్రూ లో చాలా మంది తమిళులు ఉన్నారు.

రైటింగ్ టీమ్ లో కూడా. ది ఫ్యామిలీ మ్యాన్ అనేది కొన్నేళ్ల కష్టం. మాకు తమిళులు, తమిళ సంస్కృతీపై అపారమైన నమ్మకముంది. ఎన్నో సంవత్సరాల కష్టాన్ని ఈ సిరీస్ రూపంలో తీసుకొచ్చాము. దయచేసి సిరీస్ విడుదలయ్యేవరకూ వేచి, చూసాక అప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం. మాకు తెలుసు మీకు షో బాగా నచ్చుతుందని” అని స్టేట్మెంట్ ను విడుదల చేసారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts