Homeటాప్ స్టోరీస్అప్పుడే అమెజాన్ ప్రైమ్‌లోకి సైనా మూవీ!

అప్పుడే అమెజాన్ ప్రైమ్‌లోకి సైనా మూవీ!

అప్పుడే అమెజాన్ ప్రైమ్‌లోకి సైనా మూవీ!
అప్పుడే అమెజాన్ ప్రైమ్‌లోకి సైనా మూవీ!

ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన కొన్ని బాలీవుడ్ చిత్రాలలో ఒకటి స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ `సైనా`. `తారే జమీన్ పర్` ఫేమ్ అమోల్ గుప్తే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని స్టార్ బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్ పాత్రలో పరిణీతి చోప్రా నటించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేటర్ల‌లో విడుదలైన దాదాపు ఒక నెల తరువాత ఈ స్పోర్ట్స్ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రోజు స్ట్రీమింగ్ అవుతోంది.

`సైనా` మొదట్లో 2020 ద్వితీయార్ధంలో థియేట‌ర్ల‌లోకి రిలీక్ కావాల్సింది. కాని కోవిడ్ మహమ్మారి కారణంగా మేకర్స్ విడుదలను వాయిదా వేశారు. ఫైన‌ల్‌గా ఈ చిత్రాన్ని మార్చి 26 న విడుదల చేశారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. కాని పరిణీతి తన నటనకు మాత్రం ప్రశంసలు ద‌క్క‌యి.

- Advertisement -

పుల్లెల గోపీచంద్ పాత్రలో మానవ్ కౌల్, పరుపల్లి కశ్యప్ పాత్రలో ఇషాన్ నఖ్వీ నటించారు. ఉత్తర భారతదేశంలో 50% ఆక్యుపెన్సీ నిబంధ‌న కూడా ఈ మూవీ థియేట్రికల్ రన్‌ను ప్రభావితం చేసింది. థియేటర్లలో చూడలేక‌పోయిన వారు ఈ  బయోపిక్‌ని ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూసి ఆనందించొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All