Homeన్యూస్అనిరుద్ అరబిక్ సాంగ్ కు సమంత కుమ్మేసింది

అనిరుద్ అరబిక్ సాంగ్ కు సమంత కుమ్మేసింది

అనిరుద్ అరబిక్ సాంగ్ కు సమంత కుమ్మేసింది
అనిరుద్ అరబిక్ సాంగ్ కు సమంత కుమ్మేసింది

అరబిక్ కుతు..అరబిక్ కుతు ఇప్పుడు ఈ సాంగ్ దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. తమిళ స్టార్‌ హీరో విజయ్‌, పూజా హెగ్డే జంటగా నెల్సన్‌ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘బీస్ట్‌’. ఈ సినిమా కోసం విజయ్‌ ఫ్యాన్స్‌ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.

ఈ క్రమంలో వాలంటైన్స్‌డేను పురస్కరించుకొని బీస్ట్‌ సినిమాలోని ‘అరబిక్ కుతు’ అనే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ పాట ఇటీవలే విడుదలై క్షణాల్లో లక్షలాది వ్యూస్ తో దూసుకెళ్లింది. ఇది పూర్తిగా అరబిక్ స్టైల్ సాంగ్. లిరిక్ ని కూడా అరబిక్ అండ్ తమిళ్ మిక్స్ డ్ పదాలతో ఫ్యూజన్ స్టైల్లో అదరగొట్టడంతో జెట్ స్పీడ్ తో వైరల్ అయ్యింది. అభిమానులే కాదు సినీ స్టార్స్ సైతం ఈ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేస్తున్నారు.

- Advertisement -

తాజాగా సమంత సైతం ఈ సాంగ్ కు తనదైన స్టయిల్ లో స్టెప్స్ వేసింది. ఎయిర్ పోర్ట్ టనెల్ మార్గంలో వెళుతూ ఇలా స్టెప్పులేసింది సమంత. “జస్ట్ ఎనదర్ లేట్ నైట్ ఫ్లైట్.. నాట్!!“ అంటూ ఈమోజీల్ని షేర్ చేసింది. రిథమ్ ఫర్ టునైట్ బి.. హలమితి హబీబో.. బీస్ట్ సాంగ్ అంటూ సినిమాకి బోలెడంత ప్రచారం చేసి పెట్టింది. ఇక సమంత విడాకుల తర్వాత జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ బిజీ గా మారింది. రీసెంట్ గా పుష్ప మూవీ లో ఐటెం సాంగ్ లో అదరగొట్టింది. ప్రస్తుతం సామ్ మూడు సినిమాల్లో నటిస్తుంది. దీనికి తోడు ఆమెకు మరోసారి వెబ్ సరీస్‌లో నటించే అవకాశం వచ్చిందని అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All