
తేజ సజ్జని హీరోగా పరిచయం చేస్తూ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం `జాంబిరెడ్డి`. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మిశ్రమ ఫలితాన్ని దక్కించుకుంది. అయినా మేకర్స్‌కి భారీ స్థాయిలో లాభాల్ని తెచ్చిపెట్టిందట.కారణంగా చాలా తక్కువ బడ్జెట్‌లో ఈ మూవీని తెరకెక్కించడమే నని తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ మేకర్స్‌కి లాభదాయకమైన ప్రాజెక్ట్‌గా మారినట్టు చెబుతున్నారు.
తాజా అప్‌డేట్ ప్రకారం ఈ చిత్రానికి సీక్వెల్ ని చేయబోతున్నారని తెలిసింది. దీనికి `రివెంజ్ ఆఫ్ డెత్` అనే టైటిల్‌ని ఖరారు చేశారట. పక్కా ప్రణాళిక ప్రకారం అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ సీక్వెల్ లో సమంతా అక్కినేని ప్రధాన పాత్రలో నటించే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ఇటీవలే తేజ ద్వారా సమంతను సంప్రదించాడట. ప్రశాంత్ ఈ కథను సమంతకు వివరించాడని, సామ్ ఇందులో నటించడానికి ఇష్టపడిందని చెబుతున్నారు.
సమంత ప్రస్తుతం నటించిన `ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో ఆమె నెగెటివ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ తరువాత సామ్
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రం `కాతువాకుల రేండు కాదల్`తో పాటు గుణశేఖర్ దర్శకత్వం వహించబోయే `శాకుంతలం`లో సమంత నటించనుంది.