Homeటాప్ స్టోరీస్“సామజవరగమన”..... వచ్చేస్తోంది

“సామజవరగమన”….. వచ్చేస్తోంది

Samajavaragamana  Song promo on dec 31st
Samajavaragamana Song promo on dec 31st

డిసెంబర్ 31న ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేస్తూ, అల.. వైకుంఠపురం టీం అభిమానులకు బంపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పట్లో నాకు తెలిసి, దీన్ని కొట్టే పాట రాదు… అని అనిపిస్తోంది. ఒక పాట హిట్ అవ్వాలంటే, సంగీతం, సాహిత్యం, శబ్దసౌందర్యం, గాత్ర మాధుర్యం ఇలా ఎన్ని ఉన్నా, పాట లో ఉన్న పరిస్థితులను, నిజ జీవితంలో జనాలు కూడా ఫేస్ చేస్తూ ఉంటేనే ఆ పాటను జనాలు గుండెల్లో పెట్టుకుంటారు.

సామజవరగమన” పాట ఒక ప్రియుడు తన ప్రియురాలిని ప్రసన్నం చేసుకునే దానిలో భాగంగా, ఆమె తనను ప్రేమిస్తున్నట్లు తెలియచేస్తూ ఉంటుంది కానీ, ఆ విషయం ఒప్పుకోదు. ఇలాంటి పరిస్థితి నిజజీవితంలో 90 శాతం మందికి ఉంటుంది. ఇక సాహిత్యంలో ఎవరెస్ట్ పర్వతం వంటి సీతారామ శాస్త్రి గారి గురించి రాసే శక్తీ లేదని నేనే ఒప్పుకుంటున్నా…

- Advertisement -

మెలోడీ పాటలను కొన్ని ఏళ్ళపాటు గుర్తుండేలా థమన్ గారు స్వరపరచగా, సిద్ శ్రీరాం అంతే లెవల్ లో “సామజవరగమన” పాటను పాడారు. ఇక 123 మిలియన్ వ్యూస్ దాటిన ఈ పాటను విజువల్ గా అంతే స్థాయిలో సినిమాలో ప్రెజెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే హార్డ్ వేర్ నుండి సాఫ్ట్ వేర్ వరకూ అందరినీ మళ్ళీ పుస్తకాలు చదివేలా చేసిన గురూజీ “సామజవరగమన” పాటతో కార్పోరేట్ ప్రపంచంలో కూడా కవులను బయటకు తెస్తున్నాడు.

“నువ్వు నెట్టేస్తే ఎలా .. నిట్టూర్చవటే….నిష్టూరపు విలవిలలు” అనే పదంలో

అక్కడ అంత కఠినమైన పదాలు వాడాలంటే సిరివెన్నెల సీతరామశాస్త్రి కి ఎన్ని గట్స్ కావాలి.?

అసలు అక్కడ అంత స్పేస్ లేదు… కానీ ఆయన క్రియేట్ చేసుకున్నాడు..

ఉదాహరణకు చెప్పాలంటే,.. మనం అందరం కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లు చాలా సన్నగా, ఇరుగ్గా ఉంటాయి. అలాంటి చోట్ల ఒక నాలుగు గుర్రాలు కట్టిన రథం నడపాలంటే ఎంత కష్టం.?

కానీ శాస్త్రి గారు తెల్లవారుఝామున కనిపించే చంద్రుడు లాంటి వారు. అవకాశం వచ్చినప్పుడు నెలపొడుపు గా కనపడతారు. అవసరం వచ్చినప్పుడు పూర్ణ బింబం లాగా అలరిస్తారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All