Homeటాప్ స్టోరీస్అల వైకుంఠపురంలో  “ఆ సీన్”  హైలెట్ అంటున్న అల్లు అర్జున్

అల వైకుంఠపురంలో  “ఆ సీన్”  హైలెట్ అంటున్న అల్లు అర్జున్

Ala Vaikunthapurramloo Teaser Glimpse Decoded
Ala Vaikunthapurramloo Teaser Glimpse Decoded

ముఖ్యంగా సినిమా హీరోలు రెండు రకాలు

  1. హీరోయిన్స్ తో రొమాన్స్ చేసే వాళ్ళు
  2. విలన్స్ తో రొమాన్స్ చేసే వాళ్ళు .

ఇక్కడ రొమాన్స్ అంటే నిజంగా సరసమే.. కాకపోతే ఈ జనరేషన్ కి అర్ధం అయ్యేలా చెప్పాలంటే “హార్డ్ కోర్ ఇంటిమసీ” అంటారు. అంటే మనకు బాగా ఇష్టం అయిన వ్యక్తి మనల్ని తిడుతున్నా, ఎగతాళి చేసి ఏడిపిస్తున్నా మనకు బాధ కలగదు సరికదా, వాళ్ళ మీద ఇంకా ప్రేమ పెరుగుతూ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఎమోషన్ ని మన సినిమాలలో భార్యా – భర్త ల మధ్య లవ్ సీన్ లకు, హీరో విలన్ మధ్య వచ్చే సీన్ లకు వాడతారు. కొన్ని క్లిక్ అవుతాయ్.. కొన్ని కావు.

- Advertisement -

ఇలాంటి టైప్ సీన్ లు బాగా చేసే హీరో, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , డౌట్ ఒకసారి ఆయన చేసిన గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది సినిమాలు చూడండి. ఇలాంటి సీన్ లకు చూసే వాళ్ళకి కరెక్ట్ గా తగిలేలా డైలాగ్స్ రాసే వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. కరుడుగట్టిన ఫ్యాక్షన్ కథలో కూడా పంచెల కన్నా, పంచ్ లకు ప్రాధాన్యత ఇచ్చి సినిమా హిట్ చేసారు గురూజీ.

ప్రస్తుతం “అల వైకుంఠ పురంలో” సినిమా టీజర్ glimpse చూసినట్లయితే అల్లు అర్జున్ ఎర్ర కోటుతో ఎంట్రీ ఇచ్చి, బోర్డు మీటింగ్ జరిగే టేబుల్ మీద నడుచుకుంటూ వచ్చే షాట్ చూపించారు. అంటే దానర్ధం “మనోడు మీటింగ్ లో అందరినీ ఆడుకుంటాడు అని.” ఇలాంటి సీన్ త్రివిక్రమ్ తన గత చిత్రం అజ్ఞాత వాసి లో కూడా చూపించారు. రావు రమేష్, మురళీ శర్మ ను పవన్ కళ్యాణ్ ఇలాగే సైకిల్ ఎక్కి వెంటపడి తరుముతూ ఏడిపిస్తాడు.

ఇక యాక్టింగ్ పరంగా సరైన క్యారెక్టర్ పడితే అల్లు అర్జున్ చెలరేగిపోతాడని మనకు తెలిసిందే కదా.!  ఇక గతంలో రవీంద్ర నారాయణ్ & విరాజ్ ఆనంద్ లాంటి క్యారెక్టర్స్ ద్వారా అల్లు అర్జున్ లోని విలక్షణ నటుడిని మనకు అందించిన త్రివిక్రమ్ ఈసారి గ్యాప్ వచ్చిన బన్నీ ని ఎలా చూపిస్తాడో..?

 

View this post on Instagram

 

#AlaVaikunthapurramulooTeaser Glimpse!! Teaser out on 11th Dec at 4:05PM.

A post shared by Allu Arjun (@alluarjunonline) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All