Homeటాప్ స్టోరీస్మాస్టర్ హిందీ రీమేక్ కు రెడీ అయిన సల్మాన్ ఖాన్

మాస్టర్ హిందీ రీమేక్ కు రెడీ అయిన సల్మాన్ ఖాన్

మాస్టర్ హిందీ రీమేక్ కు రెడీ అయిన సల్మాన్ ఖాన్
మాస్టర్ హిందీ రీమేక్ కు రెడీ అయిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రీసెంట్ గా హిట్స్ కొట్టడానికి కష్టపడుతున్నాడు. దబాంగ్ 3, రాధే చిత్రాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. కలెక్షన్స్ సంగతి అటుంచితే కంటెంట్ విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సల్మాన్ ఖాన్ మరోసారి సౌత్ సినిమాలపై కన్నేసినట్లు సమాచారం.

అప్పట్లో కూడా కెరీర్ సంకటంలో పడ్డ సందర్భంలో పోకిరి రీమేక్ వాంటెడ్ తో తిరిగి ట్రాక్ లో పడ్డాడు సల్మాన్ ఖాన్. ఇప్పుడు అదే పని చేయబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన విజయ్ మాస్టర్ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానుంది. సల్మాన్ ఖాన్ త్వరలోనే కొత్త సినిమాలను ప్రకటిస్తాడట. అందులోనే మాస్టర్ చిత్ర రీమేక్ విషయాన్ని కూడా తెలుపుతాడని తెలుస్తోంది. సల్మాన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All