
దేశ వ్యాప్తంగా గతేడాది కరోనా విలయాతాండం చేయడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. దీని దెబ్బకి బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పటికీ కోలుకోవడం లేదు. గత ఏడాది నవంబర్ నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీ కోలు కోవడంతో ఈ సంక్రాంతికి హిట్‌లు, బ్లాక్ బస్టర్‌లని చూశాం. కానీ ఇప్పటికీ బాలీవుడ్‌లో సినిమా రిలీజ్ చేయాలేని పరిస్థితి.
టాలీవుడ్ చిత్రాల రిలీజ్‌లతో దేశ వ్యాప్తంగా వున్న సినీ పరిశ్రమలకు ఊపిరి వచ్చినా పూర్తి స్థాయిలో తెలుగు సినిమా తరహాలో బాలీవుడ్ మాత్రం కుదురుకోలేకపోతోంది. తాజాగా సెకండ్ వేవ్ విజృంభించడం మొదలుపెట్టిన నేపథ్యంలో మళ్లీ దేశ వ్యాప్తంగా థియేటర్లు షట్ డౌన్ ప్రకటించేశాయి. దీంతో హందీ చిత్రాల పరీస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ఖాన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. సల్మాన్‌ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం `రాధే`. `ది మోస్ట్ వాంటెడ్ భాయ్` అనే ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ మూవీని రంజాన్ కానుకగా మే13న రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.
ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తూనే అదే సమయంలో పే పర్ వ్యూ పద్దతిలో జీ ప్లెక్స్, డిష్ టీవి, డీటు హెచ్, టాటా స్కై, ఎయిర్ టెల్ డిజిటల్ టీవిల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా `రాధే` ట్రైలర్‌ని గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగు సినిమాల తరహాలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంతోంది. సల్మాన్ డైలాగ్‌లు, బన్నీ నటించిన `దువ్వాడ జగన్నాథమ్` చిత్రంలోని `సీటీ మార్ .. గీతాన్ని ఈ మూవీ కోసం వాడుకున్నారు. ఈ పాటలో సల్మాన్, ది షా పటాని స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. దాదాపు 40 దేశాల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
