Homeటాప్ స్టోరీస్సలార్ కు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందట

సలార్ కు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందట

సలార్ కు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందట
సలార్ కు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందట

బాహుబలి , సాహో చిత్రాలతో నార్త్ ప్రేక్షకుల ను విపరీతంగా ఆకట్టుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. వరుస పెట్టి పాన్ మూవీస్ చేస్తూ బిజీ గా ఉన్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు , నాల్గు మూవీస్ ను లైన్లో పెట్టి షూటింగ్ లు పూర్తి చేస్తున్నాడు. వాటిలో ఒకటి సలార్. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా..హోంబలే ఫిల్మ్స్‌ భారీ ఎత్తున నిర్మిస్తుంది. కాగా ఈ సినిమాకు ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే మరింతగా అవుతుందని సమాచారం.

గతంలో ఏ సినిమాలోనూ చూడని విధంగా సలార్ సన్నివేశాలుండాలని భావిస్తున్న మేకర్స్.. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదట. దీంతో మొదట అనుకున్నదాని కంటే బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతోందట. అయినప్పటికీ సినిమాపై ఉన్న నమ్మకంతో ఖర్చు చేస్తూ వస్తున్నారట. ఆ బడ్జెట్ తెరపై స్పష్టం గా కనిపిస్తుందని అంటున్నారు. ఈ చిత్రంలో భారీ కాస్టింగ్ ఉండేలా నటీనటుల విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది.

- Advertisement -

ఇక ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మూవీ మార్చి 11 న విడుదల కాబోతుంది. గత కొన్నేళ్లుగా ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All