
శృతి హాసన్ తన కెరీర్ లోనే తొలిసారి సీనియర్ హీరోతో సినిమా చేస్తోంది. రీఎంట్రీ తర్వాత క్రాక్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టింది శృతి హాసన్. క్రాక్ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేనితో శృతికి మంచి స్నేహం ఉంది. వారిద్దరూ మొదటిసారి బలుపు సినిమాకు కలిసి పనిచేసారు. అందుకే బాలయ్య సినిమా కోసం ముందు అప్రోచ్ అయినప్పుడు చేయకూడదు అనుకున్నా కూడా గోపీచంద్ మలినేని అడగడంతో కాదనలేకపోయింది. మూవీ లాంచ్ కార్యక్రమానికి కూడా హాజరైంది శృతి.
అయితే ఈ సినిమాను నార్మల్ గా ఒప్పుకోలేదట. ఆమె కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ముందుగా తనకు 2 కోట్ల రూపాయల పారితోషికాన్ని ఇవ్వాలని చెప్పిందట. తన ప్రయాణం ఖర్చులు ఇతరత్రా దీనికి అదనం. అంతే కాకుండా ఈ చిత్రంలో ఇంటిమేట్ సీన్లు ఉండకుండా చూడాలని దర్శకుడికి చెప్పిందట శృతి. గ్లామరస్ గా కనిపించడానికి బాలయ్య పక్కన స్టెప్పులు వేయడానికి తనకు అభ్యంతరం లేదని కానీ రొమాంటిక్ సన్నివేశాలు శృతి మించకుండా చూడాలని చెప్పింది.
గోపీచంద్ మలినేని ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని అన్నీ తాను చూసుకుంటానని హామీ ఇవ్వడంతో శృతి సంతోషంగా ఈ సినిమాను ఒప్పుకుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
బాలయ్య కోసం ఆ రూల్ ను పక్కనపెట్టిన శృతి హాసన్
శృతి హాసన్ తో హ్యాట్రిక్ ను కన్ఫర్మ్ చేసిన క్రాక్ దర్శకుడు
సలార్ : ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంటున్న శృతి హాసన్
శృతి హాసన్ చేసిన వరస్ట్ డిష్ చెప్పిన బాయ్ ఫ్రెండ్