
ప్రభాస్ డైరెక్టర్ సుజిత్‌కి నెక్ట్స్ మూవీ దొరకడం కష్టంగా వుంది. `సాహో` చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించి అందరిని ఆశ్చర్యపరిచారు సుజిత్. ఉత్తరాదిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ దక్షిణాదిలో మాత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో సుజిత్ నెక్ట్స్ మూవీ కోసం శ్రమించాల్సి వస్తోంది.
సుజిత్ మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్ నచ్చడంతో హీరో రామ్‌చరణ్ మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` రీమేక్ బాధ్యతల్ని సుజిత్‌కి అప్పగించారు. స్క్నిప్ట్‌లో కీలక మార్పులు చేసిన సుజిత్ ఫైనల్ వెర్షన్ తో చిరుని సంతృప్తిపరచలేకపోయారు. దీంతో `లూసీఫర్` రీమేక్ బాధ్యతల నుంచి తానే స్వయంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. దీంతో అతని పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
తాజాగా సుజిత్‌కి ఓ హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహించే అవకాశం వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్, రాజమౌళి కలయికలో వచ్చిన హిట్ ఫిల్మ్ `చత్రపతి`. ఈ చిత్రాన్ని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో రీమేక్ చేయాలని ఓ ప్రొడ్యూసర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం బాలీవుడ్‌లో కొంత మంది దర్శకులని పరిశీలించిన నిర్మాత ఫైనల్‌గా `ఛత్రపతి` రీమేక్‌కు సుజిత్ అయితేనే కరెక్ట్ అని భావించి ఇటీవల అతన్ని సంప్రదించారట. సుజిత్ ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా అన్నది తెలియాల్సి వుంది.