Homeగాసిప్స్బజ్: ప్రభాస్ సలార్ కూడా పుష్ప దారిలోనే?

బజ్: ప్రభాస్ సలార్ కూడా పుష్ప దారిలోనే?

బజ్: ప్రభాస్ సలార్ కూడా పుష్ప దారిలోనే?
బజ్: ప్రభాస్ సలార్ కూడా పుష్ప దారిలోనే?

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం సలార్. ఈ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తయింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ చాప్టర్ 1 తో దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడు కోసం వివిధ ఇండస్ట్రీలలోని టాప్ నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. అయితే ముందుగా టాలీవుడ్ ప్రశాంత్ నీల్ ను బుక్ చేసుకుంది.

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో, మైత్రి మూవీ మేకర్స్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ దానికంటే ముందు కేజిఎఫ్ నిర్మాతలతోనే ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్ హీరోగా సలార్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ భారీ సినిమా బిజినెస్ పరంగా వర్కౌట్ అవ్వాలంటే రెండు భాగాలుగా విభజించడం ఒకటే మార్గమని ఇప్పుడు నిర్మాతలు భావిస్తున్నారు.

- Advertisement -

రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్ప విషయంలో కూడా ఇదే జరిగిన విషయాన్ని మనం గుర్తుచేసుకోవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All