Monday, September 26, 2022
Homeగాసిప్స్ప్రభాస్ సరసన నటించనున్న రాశి ఖన్నా?

ప్రభాస్ సరసన నటించనున్న రాశి ఖన్నా?

ప్రభాస్ సరసన నటించనున్న రాశి ఖన్నా?
ప్రభాస్ సరసన నటించనున్న రాశి ఖన్నా?

రెబెల్ స్టార్ ప్రభాస్ వరసగా ప్యాన్ ఇండియన్ చిత్రాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. రాధే శ్యామ్ సినిమాను దాదాపు పూర్తి చేసిన ప్రభాస్, ఆది పురుష్, సలార్ చిత్రాల షూటింగులతో బిజీగా ఉన్నాడు. వచ్చే నెలలో తిరిగి షూటింగ్స్ మొదలుపెట్టనున్నాడు. ఈ మూడు చిత్రాలు కాకుండా ప్రభాస్ నటించబోయే మరో చిత్రం కూడా ఉంది.

- Advertisement -

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చినా ప్రీ-ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వెనక్కి జరుగుతూ వచ్చింది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఇప్పటివరకూ ఇండియన్ సినిమాలో ఎవరూ అటెంప్ట్ చేయని కాన్సెప్ట్.

దీపికా పదుకోన్ ను హీరోయిన్ గా ఎంచుకున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రాశి ఖన్నా నటించనుందని తెలుస్తోంది. ఈమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండనుందట. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts