Homeటాప్ స్టోరీస్సాయి పల్లవి రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటో

సాయి పల్లవి రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటో

sai pallavi rejected rashi khanna acceptedనితిన్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ” శ్రీనివాస కళ్యాణం ” కాగా ఈ చిత్రంలో మొదట హీరోయిన్ గా సాయి పల్లవి ని అనుకున్నారు కానీ కథ విన్నాక ఆమెకు నచ్చకపోవడంతో శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది . కట్ చేస్తే సాయి పల్లవి స్థానంలో రాశి ఖన్నా ని తీసుకున్నారు సినిమా పూర్తయ్యింది ఇక ఆగస్టు 9 న సినిమా విడుదల అవుతోంది . అయితే సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాని రాశి ఖన్నా చేయడానికి గల కారణం ఏంటి ? అంటే ఆమెకు తన పాత్ర నచ్చడమే అట !

సాయి పల్లవి ఏమో తన పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదని అందుకే ఆ సినిమా ని రిజెక్ట్ చేసానని సన్నిహితుల వద్ద వాపోయిందట ! కానీ రాశి ఖన్నా మాత్రం నా పాత్ర చాలా బాగుందని పైగా మా కుటుంబ సభ్యులకు కూడా నా పాత్ర చాలా బాగా నచ్చిందని అందుకే చేసానని ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని నాకు మంచి పేరు తెస్తుందని సంతోషంగా చెబుతోంది . అయితే సాయి పల్లవి ఈ శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించకపోవడానికి మరో కారణం ఉందని అంటున్నారు . దిల్ రాజు బ్యానర్ లో సాయి పల్లవి ఫిదా , ఎం సి ఏ చిత్రాలు చేసింది కాగా ఆ సమయంలో నాని తో సాయి పల్లవి కి గొడవ జరగడంతో దిల్ రాజు మధ్యవర్తిత్వం వహించాడని , దిల్ రాజు బ్యానర్ లో రెండు సినిమాలు చేసినప్పటికీ ఎక్కడో ఇగో దెబ్బతినడంతో రిజెక్ట్ చేసిందని అంటున్నారు . సాయి పల్లవి మంచి పాత్ర మిస్ అయ్యిందా ? లేదా ? అన్నది తెలియాలంటే ఆగస్టు 9 వరకు ఎదురు చూడాల్సిందే ఎందుకంటే ఆ రోజే శ్రీనివాస కళ్యాణం చిత్రం విడుదల అవుతోంది కాబట్టి .

- Advertisement -

English Title: sai pallavi rejected rashi khanna accepted

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All