Homeటాప్ స్టోరీస్శ్రీనివాస కళ్యాణం టీజర్ టాక్

శ్రీనివాస కళ్యాణం టీజర్ టాక్

nithin srinivasa kalyanam teaser talkనితిన్ రాశి జంటగా నటించిన చిత్రం ” శ్రీనివాస కళ్యాణం ”. శతమానం భవతి వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు . ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ ని నిన్న సాయంత్రం హైదరాబాద్ లో విడుదల చేసారు . ఆడియో వేడుక ని నిర్వహించిన దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం పై చాలా ఆశలే పెట్టుకున్నాడు . రాజ్ తరుణ్ తో నిర్మించిన లవర్ డిజాస్టర్ కావడంతో ఈ చిత్రం పై ఆశలు పెట్టుకున్నాడు .

ఇక టీజర్ విషయానికి వస్తే లవ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది . కుటుంబ కథా చిత్రంతో ఆకట్టుకున్న సతీష్ వేగేశ్న మరోసారి శ్రీనివాస కళ్యాణం తో అదే ప్రయత్నం చేసాడు . ప్రకాష్ రాజ్ , రాజేంద్ర ప్రసాద్ లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో నితిన్ – రాశి చూడముచ్చటగా ఉన్నారు . నితిన్ కు హిట్ లభించేలాగే ఉంది టీజర్ చూస్తుంటే . మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు , పాటలు ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి ఇక ఆగస్టు 9న సినిమా విడుదల కానుంది కాబట్టి దిల్ రాజు తో పాటు నితిన్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు …….. ఎందుకంటే దిల్ రాజు కు లవర్ దెబ్బకొట్టింది అలాగే నితిన్ కు కూడా వరుస ప్లాప్ లు వస్తున్నాయి కాబట్టి .

- Advertisement -

English Title: nithin srinivasa kalyanam teaser talk

           click here srinivasa kalyanam audio launch photos

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts