HomeVideosసాయి తేజ్ రిపబ్లిక్ ట్రైలర్: అంచనాలను రేకెత్తించిన పొలిటికల్ డ్రామా

సాయి తేజ్ రిపబ్లిక్ ట్రైలర్: అంచనాలను రేకెత్తించిన పొలిటికల్ డ్రామా

సాయి తేజ్ రిపబ్లిక్ ట్రైలర్: అంచనాలను రేకెత్తించిన పొలిటికల్ డ్రామా
సాయి తేజ్ రిపబ్లిక్ ట్రైలర్: అంచనాలను రేకెత్తించిన పొలిటికల్ డ్రామా

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. అక్టోబర్ 1న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ ను లాంచ్ చేసారు. టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దేవా కట్టా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. రిపబ్లిక్ చిత్రంపై మొదటినుండి మంచి అంచనాలే ఉన్నాయి.

ఇక ట్రైలర్ చూసిన తర్వాత రిపబ్లిక్ మీద అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా, పవర్ఫుల్ గా ఉంది అని చెప్పాలి. తేజ్ ఇందులో అభిరామ్, జిల్లా కలెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. వ్యవస్థను దోచుకు తినే రాబందుల నుండి సమాజాన్ని కాపాడే వ్యక్తిగా కనిపిస్తాడని అర్ధమవుతోంది.

- Advertisement -

ఇక దేవా కట్టా రాసిన డైలాగ్స్ సినిమాలో ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. “అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది” వంటి డైలాగ్స్ ఆలోజింపచేసేవిగా ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ ఇంటెన్స్ నటన, మణిశర్మ టెరిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి. మొత్తంగా రిపబ్లిక్ సూపర్ హిట్ అనిపించే రేంజ్ ఉన్న సినిమాగా అనిపించింది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All