Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ సరసన ఆర్ ఎక్స్ 100 బ్యూటీ

అల్లు అర్జున్ సరసన ఆర్ ఎక్స్ 100 బ్యూటీ

RX 100 beauty payal rajput romance with allu arjunఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన భామ పాయల్ రాజ్ పుత్ . బోల్డ్ అంశాలతో తెరకెక్కిన ఆ చిత్రంలో రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించి కుర్రకారుని పిచ్చేకించింది . కాగా ఆ సినిమా తర్వాత ఈ హాట్ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి . కాగా తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ సరసన నటించే గోల్డెన్ చాన్స్ ఈ భామకు వచ్చిందని అంటున్నారు . అరవింద సమేత వీర రాఘవ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో పాయల్ రాజ్ పుత్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది .

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు విడుదల కాగా తాజాగా హ్యాట్రిక్ కోసం మరోసారి కలుస్తున్నారు అల్లు అర్జున్ -త్రివిక్రమ్ . అయితే ఈ చిత్రం డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది కాబట్టి ఒక హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . మొత్తానికి ఈ వార్త నిజమే అయితే పాయల్ రాజ్ పుత్ కెరీర్ మరో లెవల్ కు వెళ్ళినట్లే ! అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ అంటే పాయల్ రాజ్ పుత్ పంట పండినట్లే !

- Advertisement -

English Title: RX 100 beauty payal rajput romance with allu arjun

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All