Homeటాప్ స్టోరీస్ఫైనల్ సాంగ్ షూట్ ను మొదలుపెట్టిన ఆర్ ఆర్ ఆర్ టీమ్

ఫైనల్ సాంగ్ షూట్ ను మొదలుపెట్టిన ఆర్ ఆర్ ఆర్ టీమ్

ఫైనల్ సాంగ్ షూట్ ను మొదలుపెట్టిన ఆర్ ఆర్ ఆర్ టీమ్
ఫైనల్ సాంగ్ షూట్ ను మొదలుపెట్టిన ఆర్ ఆర్ ఆర్ టీమ్

ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కేవలం ఒక్క సాంగ్ ను మాత్రమే షూట్ చేయాల్సి ఉంది. దీనికోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ యూరోప్ వెళ్లినట్లుగా తెలిసింది. అంతే కాకుండా ఉక్రెయిన్ లో ల్యాండ్ అయిన ఆర్ ఆర్ ఆర్ బృందం మిగిలిన సాంగ్ పోర్షన్ ను షూట్ చేస్తోంది. ఆ సాంగ్ షూట్ ఈరోజు నుండి మొదలైనట్లు తెల్సింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ సాంగ్ షూట్ లో పాల్గొంటున్నారు.

ఎన్టీఆర్ కొమురం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య అక్టోబర్ 13న విడుదల కానుంది. మొత్తం ఐదు భాషల్లో ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతుంది. ఈ మధ్యే విడుదలైన మొదటి పాట దోస్తీకు భారీ రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

ఒలీవియా మోరిస్, అలియా భట్ లు ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపిస్తాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మాత.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All