
టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి నుండి మరో సినిమా వస్తోంది. బాహుబలి తర్వాత దాదాపు అదే టెక్నీకల్ టీమ్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో సాంగ్ చిత్రీకరిస్తే చాలు. అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మరోసారి కన్ఫర్మ్ చేసారు.
ఇక ప్రమోషన్స్ ను కూడా షురూ చేసారు. రాజమౌళి ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. ముందుగా ఆర్ ఆర్ ఆర్ రోర్ అంటూ ఒక మేకింగ్ వీడియో వదిలాడు. ఇందులో తన టీమ్ పడిన కష్టాన్ని వీడియో రూపంలో రూపొందించారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియలను కూడా ఈ వీడియోలో చూపించారు. ఇక మేకింగ్ పరంగా టీమ్ ఎంత శ్రమ పడిందో మనం చూడచ్చు. మొత్తంగా ఈ వీడియో మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ ఆఖరి పాట చిత్రీకరణ వచ్చే నెలలో మొదలవుతుంది.
The effort behind creating the ultimate theatrical experience is here!
Watch the making of #RRRMovie here ???????? https://t.co/A27oTfLPp1#RoarOfRRR @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani @ajaydevgn @aliaa08 @oliviamorris891 @DVVMovies
— RRR Movie (@RRRMovie) July 15, 2021