
సమంత తన రేంజ్ ను పెంచుకుంటోంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో సామ్ పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నెగటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ అయినా సామ్ పోషించిన విధానానికి అందరూ ఫిదా అవుతున్నారు.
ఈ నేపథ్యంలో సమంతకు వెబ్ సిరీస్ ఆఫర్లు కూడా కోకోల్లలుగా వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ బాహుబలి వెబ్ సిరీస్ ను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలని తలపెట్టింది. ఇందుకోసం ముందుగా ప్రవీణ్ సత్తారు, దేవ కట్టాలను దర్శకులుగా ఎంచుకుంది. కానీ ఏమైందో తెలీదు కానీ ఆ ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది.
ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ మరో దర్శకుడిని, టీమ్ ను తీసుకుంది. సమంతను శివగామి యంగ్ వెర్షన్ కు అడిగారు. రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఆఫర్ చేసారు. శివగామి చిన్నప్పటి జీవితం, ఆమె రాణి అవ్వడానికి జరిగిన పరిణామాల నేపథ్యంలో కథ సాగుతుంది. అయితే ఆశ్చర్యకరంగా ఇంత మంచి ప్రాజెక్ట్ కు సామ్ నో చెప్పేసింది.