Homeటాప్ స్టోరీస్“మీరంటే భయం ఉండాలి; కామెడీలు చెయ్యద్దు.!” – రామ్ గోపాల్ వర్మ

“మీరంటే భయం ఉండాలి; కామెడీలు చెయ్యద్దు.!” – రామ్ గోపాల్ వర్మ

“మీరంటే భయం ఉండాలి; కామెడీలు చెయ్యద్దు.!” – రామ్ గోపాల్ వర్మ
“మీరంటే భయం ఉండాలి; కామెడీలు చెయ్యద్దు.!” – రామ్ గోపాల్ వర్మ

భారతదేశం కరోనా వైరస్ ప్రభావం అరికట్టడానికి మరియు వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను నియంత్రించడానికి పోలీసులు వివిధ రకాలైన వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజలలో అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు,నర్సులు,ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మరియు పోలీసు వారు మనకు దేవుడితో సమానం. మనం చేయవలసిందల్లా కనపడని ఆ దేవుడిని కనపడే ఈ దేవుళ్ళు ఎప్పుడూ సురక్షితంగా,ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడమే. ఎందుకంటే ప్రస్తుతం ప్రత్యక్షంగా వాళ్లే వైరస్ పై పోరాటం చేస్తున్నారు.

పార్వతీపురం సర్కిల్ పోలీసు శాఖ సిబ్బంది కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మరియు ప్రజలలో వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజికంగా దూరం పాటించే విధంగా అవగాహన పెంపొందించడానికి ఒక వీడియో రూపొందించారు. సదరు వీడియో లో భాగంగా  ప్రజలందరూ షేక్ హ్యాండ్ కి దూరంగా ఉండాలనీ, “నమస్కారం” అనే పిలుపుతో పలకరించుకోవాలనీ, అదేవిధంగా వ్యక్తిగతంగా సామాజికంగా ఇతరుల నుంచి కొంచెం దూరం పాటించాలి.. అనే విషయాన్ని వినోదాత్మకంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు.

- Advertisement -

 అయితే ప్రముఖ దర్శకుడు సంచలనాలకు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ వీడియో పట్ల  స్పందించారు. “ప్రజలకు ఏదైనా విషయంపై అవగాహన కలిగించాలనే మీ ప్రయత్నం అభినందనీయం.! కానీ ఈ విధంగా చేస్తే  వారు ప్రస్తుత పరిస్థితిని కూడా కొంచెం జోక్ గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి యావత్ పోలీసు శాఖ వారు.. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం యొక్క తీవ్రతను మన ప్రజలకు సీరియస్ గా తెలియజేయాలి అని కోరుకుంటున్నాను.” అని రాంగోపాల్ వర్మ తన సామాజిక మాధ్యమం లో స్పందించారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All